టీమిండియా నుంచి ఔట్.. సూర్యకుమార్ యాదవ్ రియాక్షన్ ఇదే!
భారత టీ20 క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. అప్‌కమింగ్ ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల కోసం బీసీసీఐ సరికొత్త టీ20 జట్టును ప్రకటించింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు చేసిన ఈ భారీ మార్పుల్లో భాగంగా.. భారత టీ20 జట్టు నుంచి సూర్యకుమార్ యాదవ్ ఉద్వాసనకు గురయ్యాడు. కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు చోల్పోయాడు.
అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను నూతన టీమిండియా టీ20 సారథిగా బీసీసీఐ సెలెక్టర్లు నియమించారు. సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. టీ20 ప్రపంచకప్ గెలిచినా టీమ్ భవిష్యత్తు కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవన్నాడు.
సూర్య గొప్ప మనసు..
తనను టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కోల్పోయినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న టీమిండియాకు తన పూర్తి మద్దతును తెలియజేశాడు. యువకులతో కూడిన ఈ కొత్త జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు.

ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నూతన జట్టుకు సంబంధించిన ఫొటోను పంచుకున్నాడు. మరో పోస్ట్‌లో వైభవ్ సూర్యవంశీ ప్రతిభను ప్రత్యేకంగా కొనియాడిన సూర్య.. వైభవ్ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని అభినందించాడు. అంతర్జాతీయ వేదికపై అతడి ఆటను చూడటానికి తాను ఎంతో ఆత్రుతగా ఉన్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు సూరీడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సూర్యది గొప్ప మనసు అంటూ కొనియాడుతున్నారు.
పేలవ ఫామ్‌తో..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026తో పాటు ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా నిరాశపర్చాడు. మెగా టోర్నీలో 9 ఇన్నింగ్స్‌ల్లో 242 పరుగులు మాత్రమే చేసిన సూరీడు.. ఐపీఎల్ 2026 సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 20.76 సగటుతో 270 పరుగులే చేశాడు. అతని వైఫల్యం ముంబై విజయవకాశాలను దెబ్బతీసింది. సూర్య ఐపీఎల్ కెరీర్‌లోనే ఇది డిజాస్టర్‌గా నిలిచిపోయింది.

సచిన్ రికార్డు బద్దలు..
టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తొలిసారి టీమిండియా పిలుపు అందుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో పాటు ఆసియా గేమ్స్‌కు ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లకు ఎంపికైన సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అరుదైన రికార్డ్‌ను వైభవ్ సూర్యవంశీ అధిగమించనున్నాడు. 15 ఏళ్ల వయసులోనే అతర్జాతీయ క్రికెట్ ఆడిన భారత ఆటగాడిగా నిలవనున్నాడు. సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయసులో ఈ ఫీట్ సాధించాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈ వండర్ కిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ టోర్నీలో ఏకంగా 237.31 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. దాంతో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, అత్యధిక సిక్సర్ల అవార్డ్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డ్స్‌ను కైవసం చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

