For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022 Mega Auction: సూర్యకుమార్ యాదవ్‌పై కన్నేసిన ఆ మూడు జట్లు! వేలంలో రూ. 12-14 కోట్లు పక్కా!

Suryakumar Yadav Price In IPL 2022 Mega Auction: 3 Teams Eyeing On His Dashing Batsman
IPL 2022 Mega Auction : 3 Teams That Can Target Suryakumar Yadav In IPL 2022

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగే అవకాశాలు కనిపించడం లేదు. గత మూడేళ్లుగా ముంబై తరఫున దుమ్మురేపిన ఈ ఇండియన్ బ్యాట్స్‌మన్ కోసం ఇతర ఫ్రాంచైజీలు కాచుకొని కూర్చున్నాయి. పైగా వచ్చే ఏడాది కొత్తగా రెండు జట్లు లీగ్‌లో చేరుతుండటంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మెగా వేలం నిర్వహించనుంది.

ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ మెగా ఆక్షన్ నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. దాంతో ఆయా జట్లలో ఉన్న ఆటగాళ్లంతా మారనున్నారు. ఇప్పటికే మెగా వేలానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించిన బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

నలుగురికే చాన్స్..

నలుగురికే చాన్స్..

మెగావేలంలో నేపథ్యంలో ఆటగాళ్ల రిటైన్ పాలసీని కూడా రూపొందించి ఓ బ్లూ ప్రింట్‌ను సిద్దం చేసింది. దీనిక ప్రకారం ఫ్రాంఛైజీలకి గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లని రిటైన్ చేసుకునే వెసులబాటు ఉంటుంది. ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లు, ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు భారత క్రికెటర్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉండొచ్చు. ఒకవేళ ముగ్గురు ప్లేయర్లనే ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకుంటే వారి సాలరీ రూ.15, రూ.11, రూ.7 కోట్లుగా ఉండనుంది.

ఒకవేళ ఇద్దరినే రిటైన్ చేసుకుంటే రూ.12.5, రూ.8.5 కోట్లు, ఒకవేళ ఒక్కరినే తీసుకుంటే అప్పుడు రూ.12.5 కోట్లు ఆ ప్లేయర్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఫ్రాంఛైజీల పర్స్ వాల్యూని రూ.5 కోట్లు పెంచారు. దాంతో.. ప్రతి ఫ్రాంఛైజీ పర్స్‌వాల్యూ రూ.90 కోట్లకి పెరగనుంది. వేలంలో ఈ పర్స్ వాల్యూలో కనీసం 75% కచ్చితంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాంతో తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించేందుకు ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి.

సూర్యకు నో చాన్స్..

సూర్యకు నో చాన్స్..

మెగా వేలం నేపథ్యంలో బలమైన కోర్ టీమ్ కలిగిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు చెల్లాచెదురు కానున్నారు. రిటైన్ పాలసీ ప్రకారం నలుగురికే అవకాశం ఉండటంతో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్‌లను ఆ జట్టు ఎలాగు వదులుకోలేదు. కాబట్టి సూర్య కుమార్‌యాదవ్ జట్టును వీడటం ఖాయం. వేలంలో మళ్లీ కొనుగోలు చేయాలని ఆ జట్టు భావించినా.. ఇతర జట్లు సూర్యకోసం కాచుకొని కూర్చున్నాయి.

ఎంతటి ధరనైనా చెల్లించేందుకు సిద్దంగా ఉన్నాయి. ముఖ్యంగా మూడు జట్లు సూర్య తీసుకునేందుకు రెడీగా ఉన్నాయి. కొత్తగా వచ్చే రెండు జట్లు కూడా సూర్య కోసం పోటీ పడే అవకాశాలున్నాయి. దాంతో అతను ఈజీగా రూ.12-14 కోట్లు పలికే చాన్స్ ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్..

చెన్నై సూపర్ కింగ్స్..

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం బలమైన ఇండియన్ లైనప్‌తోనే ముందుకుసాగింది. అయితే మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనాల వయసు ధృష్ట్యా వారిని రిటైన్ చేసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ జట్టుకు మ్యాచ్ విన్నర్లు కావాలి. అది కూడా భారత ఆటగాళ్లయి ఉండాలి. సూర్యకుమార్ యాదవ్ వంటి విభిన్నమైన ఆటగాడు ఆ జట్టుకు సరిగ్గా సరిపోతాడు.

అతను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. ముఖ్యంగా స్పిన్నర్లను సమర్థవంతంగా ఆడగలడు. సూర్యలాంటి బ్యాట్స్‌మెన్ చెన్నైకి చాలా అవసరం. అంతేకాకుండా ధోనీ తప్పుకునే అవకాశాలు ఉండటంతో కెప్టెన్‌గా జట్టును నడిపించేందుకు సూర్య సరైనవాడని ఆ ఫ్రాంచైజీ భావించవచ్చు.

సన్‌రైజర్స్ హైదరాబాద్..

సన్‌రైజర్స్ హైదరాబాద్..

సూర్యకుమార్ యాదవ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా పోటీ పడే అవకాశం ఉంది. సరైన భారత ఆటగాళ్లు లేకనే ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్ ఆ తప్పిదాలను సరిచేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఆ క్రమంలోనే సూర్య కోసం పోటీపడవచ్చు.సూర్యకు ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్‌లో కావాల్సిన అనుభవం ఉంది. అతను ధాటిగా ఆడటంతో పాటు యాంకర్ రోల్ కూడా పోషించగలడు.

అవసరమైతే సూర్యను ఓపెనర్‌గా, మిడిలార్డర్, లోయరార్డ్‌లో కూడా ఆడించవచ్చు. ఇక కొత్తగా వచ్చే రెండు జట్లు కూడా తమకు కెప్టెన్‌గా సూర్య సరిపోతాడని భావించవచ్చు. సూర్యలాంటి యువ ఆటగాడిని తీసుకుంటే భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనలో ఆ జట్లు ఉండచ్చు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..

సూర్యకుమార్ యాదవ్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ యువ బ్యాట్స్‌మన్ కోసం ఎంత ధరనైనా చెల్లించేందుకు ఆ జట్టు సిద్దపడుతోంది. ఎందుకంటే ఆ జట్టులోని ఇండియన్ బ్యాట్స్‌‌మన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ మినహా మరే భారత ఆటగాడు సత్తా చాటలేకపోతున్నారు. గత కొన్నేళ్లుగా ఆ జట్టు ఈ సమస్యతో బాధపడుతుంది.

ఈ సీజన్‌లో రజత్ పటీదార్, షాబాజ్ నదీమ్‌లను తీసుకున్నా.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. సెకండాఫ్‌లో కేఎస్ భరత్ పర్వాలేదనిపిస్తున్నాడు. అయితే వచ్చే సీజన్‌ నుంచి తాను ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉండలేనని విరాట్ కోహ్లీ ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తమ జట్టు సారథిగా సూర్య సెట్ అవుతాడని ఆ టీమ్ భావించవచ్చు. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఆర్‌సీబీ తదుపరి కెప్టెన్‌గా సూర్య సరిపోతాడని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే సూర్య కోసం ఆర్‌సీబీ ఎంతకైనా తెగించవచ్చు.

Story first published: Tuesday, October 5, 2021, 15:35 [IST]
Other articles published on Oct 5, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+