Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లోకల్ లీగ్‌లోనూ సూరీడు విఫలం

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. జట్టు మారినా.. టోర్నీ ఏదైనా సూర్య ఆట మాత్రం మారడం లేదు. ఐపీఎల్ 2026 సీజన్‌లో దారుణంగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్.. ముంబై ఇండియన్స్ ఘోర పరాభావంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు టీమిండియా తరఫున కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

తిరిగి ఫామ్ అందుకునేందుకు స్థానిక ముంబై టీ20 లీగ్‌లో బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ అక్కడ కూడా తీవ్రంగా నిరాశపర్చాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 19(11), 4(6) పరుగులే చేసి వెనుదిరిగాడు.

ఈ టోర్నీలో ట్రయంఫ్ నైట్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న సూర్యకుమార్ యాదవ్ మంగళవారం 19(11)రన్స్ చేయగా.. గురువారం 6 బంతుల్లో నాలుగు పరుగులే చేసి ఔట్ అయ్యాడు. ఈ పేలవ ఫామ్ నేపథ్యంలోనే భారత టీ20 జట్టు సారథ్య బాధ్యతల నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ తొలగించనుందని, జట్టులో చోటు కూడా కష్టమేనని వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ నిర్ణయంపై ఈ ప్రదర్శన ప్రభావం చూపే అవకాశం ఉంది.

Suryakumar Yadav Poor Form Continues Star Batter Fails in Mumbai T20 League Right After IPL 2026

సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ టీ20 సారథిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సూర్య స్థానంలోనే అయ్యర్ బ్యాటింగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని బీసీసీఐ నిర్ణయించింది. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ సారథ్య బాధ్యతలు చేపడుతాడు. ఐర్లాండ్‌, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్‌ల్లో టీమిండియాను శ్రేయస్ అయ్యర్ నడిపిస్తాడు.

గతంలో సూర్యకుమార్ యాదవ్ ఆడిన నాలుగో నంబర్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు దిగుతాడు. యువ బ్యాటర్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించనున్నారు. టీ20 ప్రపంచకప్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్‌ను ఈసారి పరిగణనలోకి తీసుకోలేదు.

హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. సంజు శాంసన్‌ను కెప్టెన్‌ను చేయాలని కోరాడు. కానీ అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ అందుకు అంగీకరించలేదు. సంజూ బ్యాటింగ్‌లో నిలకడ లేదని సాకుగా చూపారు.

ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చినప్పటికీ.. సంజూను కెప్టెన్ చేసేందుకు అంగీకరించలేదు. చివరికి శ్రేయాస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా.. తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించడానికి అందరూ అంగీకరించారు. ఈ చర్చల్లో రజత్ పటీదార్ పేరు ప్రస్తావనకు రాలేదు.'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.

Story first published: Thursday, June 4, 2026, 22:08 [IST]
Other articles published on Jun 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+