Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాన్న పంపించిన ఆ మెసేజ్ నమ్మలేకపోయా: సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav Opens Up After Becoming Vice Captain In Home Series Against Sri Lanka

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది శ్రీలంకతో జరగనున్న మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లకు భారత సెలెక్షన్ కమిటీ వేర్వేరు జట్లను మంగళవారం ప్రకటించింది. టీ20 ఫార్మాట్‌లో హార్దిక్ పాండ్యా జట్టును నడిపించనుండగా.. అతనికి సూర్యకుమార్ యాదవ్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఇక తాను వైస్ కెప్టెన్‌గా ఎంపికవ్వడంపై సూర్యకుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు.

ఇదంతా కలలా ఉందని చెప్పిన సూర్య.. తన తండ్రి మెసేజ్ ద్వారా వైస్ కెప్టెన్సీ గురించి తెలియజేశాడని చెప్పాడు. ఆ మెసేజ్ చూసి నమ్మలేకపోయానని చెప్పిన సూర్య.. తన ఆటకు లభించిన రివార్డుగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

నాన్న మెసేజ్‌తో..

నాన్న మెసేజ్‌తో..

ప్రస్తుతం ముంబై తరపున సౌరాష్ట్రతో రంజీ మ్యాచ్‌ ఆడుతున్న సూర్య వైస్ కెప్టెన్సీపై స్పందిస్తూ.. 'ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మా నాన్న నుంచి వైస్ కెప్టెన్సీ నియామకం గురించి తెలుసుకున్నాను. ఆయన జట్టు జాబితాతోపాటు.. ఓ మెసేజ్‌ కూడా పంపారు. 'నువ్వు ఏమాత్రం ఒత్తిడికి లోనుకావద్దు.

నీ బ్యాటింగ్‌ను ఎంజాయ్‌ చేయ్‌' అని దానిలో పేర్కొన్నారు. ఈ ప్రమోషన్‌ నేను ఏమాత్రం ఊహించలేదు. ఒక్కసారి కళ్లు మూసుకొని ఇది నిజమేనా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఆ ఫీలింగ్‌ అద్భుతంగా ఉంది. ఈ ఏడాది నా ఆటతీరుకు లభించిన రివార్డుగా భావిస్తున్నానని మాత్రం చెప్పగలను.

బ్యాటింగ్ ఆస్వాదించడమే...

బ్యాటింగ్ ఆస్వాదించడమే...

నాకు చాలా ఆనందంగా అనిపించింది. భవిష్యత్తుపైనే దృష్టిపెట్టాను. ఇక ఒత్తిడి విషయం అంటారా.. నేను ఎప్పుడూ బాధ్యతలను, ఒత్తిడిని స్వీకరిస్తాను. ఎప్పుడూ నా ఆటను ఎంజాయ్‌ చేస్తాను.. అంతకు మించి ఎక్కువగా ఆలోచించను. అది చాలా సులువు.. నేను హోటల్‌లో, నెట్స్‌లో ఉన్నప్పుడు జట్టు గురించి ఆలోచిస్తాను.

ఎప్పుడైతే నేను బ్యాటింగ్‌ చేసేందుకు క్రీజులోకి అడుగుపెడతానో.. ఇక నా ఆటను మాత్రమే ఎంజాయ్‌ చేస్తా'' అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

ఆకాశమే హద్దుగా..

ఆకాశమే హద్దుగా..

2022లో సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20ల్లో పెను సంచలనాలు సృష్టించాడు. మొత్తం 31 మ్యాచ్‌లు ఆడిన అతను 1,164 పరుగులు చేశాడు. దీనిలో రెండు శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. అతని స్ట్రైక్‌ రేట్‌ 187గా ఉందంటే పిచ్‌పై ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు ప్రపంచ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకుల్లో కూడా తొలి స్థానంలో ఉన్నాడు. తాజాగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ నామినేషన్‌లోనూ సూర్య చోటు దక్కించుకున్నాడు.

Story first published: Thursday, December 29, 2022, 15:00 [IST]
Other articles published on Dec 29, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+