Suryakumar Yadav ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

హైదరాబాద్: భారత క్రికెట్‌లో అత్యంత ఆదరణ కలిగిన యువ ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు. ప్రస్తుతం యావత్ క్రికెట్ ప్రపంచం అతని గురించే మాట్లాడుతోంది. టీ20 ప్రపంచకప్ 2022లో తనదైన ఆటతో దుమ్మురేపుతున్న సూర్య.. ప్రపంచ బౌలర్లను గడగడలాడిస్తున్నాడు. మైదానం నలువైపులా ఆడే సూర్యను ఆపడటం బౌలర్ల వల్ల కావడం లేదు. ఇక సూర్య బ్యాటింగ్ ఫిదా అయిన పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్.. అతను గ్రహంతరవాసి అని కితాబిచ్చాడు. సూర్య ఆట మనుషులు ఆడేలా లేదని పేర్కొన్నాడు. సూర్య లాంటి ప్లేయర్‌ను తాను ఇప్పటి వరకు చూడలేదని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కితాబిచ్చాడు.

సంపాదనలోనూ దూకుడు..
గత వారమే సూర్య టీ20ల్లో నెంబర్ వన్ ర్యాంకు అందుకున్నాడు. సూపర్ -12 స్టేజ్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన అతను 225 పరుగులతో సెకండ్ హయ్యెస్ట్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఆటలో దుమ్మురేపుతున్న సూర్య.. సంపాదనలో అదరగొడుతున్నాడు. 2011 ఐపీఎల్‌లో రూ.10 లక్షల
కనీస ధరకు సూర్యను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత కోల్‌కతాకు మారిన అతను లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక 2018లో మళ్లీ ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయగా.. సూర్య రాతనే మారిపోయింది. నిలకడైన ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన సూర్య.. 2021లో ఇంగ్లండ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అనతి కాలంలోనే టీమిండియా కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. తనకే సాధ్యమైన ఆటతో 360 డిగ్రీ ప్లేయర్‌గా విమర్శకుల మన్ననలు పొందాడు.

నెలకు కోటి రూపాయలు..
నెలకు కోటి రూపాయల వరకు సంపాదించే సూర్య కుమార్ యాదవ్ నెట్ వర్త్ రూ.30 కోట్లుగా ఉంటుందనేది బిజినేస్ వర్గాల అంచనా. అతని క్రికెట్ కాంట్రాక్టులు, ఇతర ఆదాయం, ఆస్థులు నుంచి అతను చెల్లించాల్సిన డబ్బులు మొత్తం తీసేయగా.. సూర్య సంపద రూ.30 కోట్లు (నెట్‌వర్త్) ఉంటుంది. బీసీసీఐ నుంచి గ్రేడ్ సీ కాంట్రాక్టు కలిగిన సూర్య.. కోటి రూపాయల వార్షిక వేతనం అందుకుంటున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున 8 కోట్లు ఆర్జిస్తున్నాడు. పలు సంస్థలకు ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్నాడు. డ్రీమ్ ఎలెవన్, మాగ్జిమా వాచ్, రైస్ వరల్డ్ వైడ్, సరీన్ స్పోర్ట్స్, పింటో పీనట్, బటర్, నీమాన్స్ ఫుట్ వేర్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

లగ్జరీ కార్లు, బైక్స్..
సూర్యకుమార్ దగ్గర లగ్జరీ కార్లు ఉన్నాయి. రూ.40 లక్షల ఖరీదు చేసే టయోటా ఫార్చూనర్, రూ. 75 లక్షల విలువ గల బీఎండబ్ల్యూ 5 సిరీస్ 530 డీ ఎమ్ స్పోర్ట్స్, నిస్సాన్ జోంగా, ఆడీ ఏ6, రేంజ్ రోవర్, హ్యూండయ్ ఐటీ20 వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. సుజుకీ హయబుసా, హార్లీ డేవిడ్సన్ వంటి లగ్జరీ బైక్‌లు కూడా ఉన్నాయి. ముంబైలోని చెంబర్ ఏరియాలో సూర్యకు లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉంది. ఈ ఫ్లాట్ ఖరీదు తెలియనప్పటికీ.. అపార్ట్ మెంట్ పై ఫ్లోర్‌లో ఉంది. చాలా ఖరీదైన ఫ్లాట్ అని రియల్ ఎస్టెట్ నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచకప్ గెలిస్తే..
ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్య.. భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషిస్తే..మరో ఏడాదిలోపే అతని నెట్ వర్త్ రూ.100 కోట్లు ధాటే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే అందరి నోట ఉన్న సూర్య కోసం బడా కంపెనీలు క్యూ కడుతున్నాయని, టీ20 ప్రపంచకప్ గెలిస్తే.. సంపాదనలో విరాట్, రోహిత్ సరసన నిలుస్తాడని జోస్యం చెబుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications