
దుబాయ్: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన అవార్డును సొంతం చేసుకున్నాడు. ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును గెలుచుకున్నాడు. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ మిస్టర్ ప్లేయర్‌ను ప్రతిష్టాత్మక అవార్డును ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. గతేడాది 31 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 46.56 సగటు, 187.43 స్ట్రైక్‌రేట్‌తో 1164 పరుగులు చేశాడు. ఇందులో రెండు, 9 హాఫ్ సెంచరీలున్నాయి.
ఓ క్యాలెండర్ ఇయర్‌లో 1000 ప్లస్ టీ20 రన్స్ చేసిన రెండో బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ గుర్తింపు పొందాడు. గతేడాది మొత్తం 68 సిక్స్‌లు బాదిన సూర్య.. ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సూర్య.. 6 ఇన్నింగ్స్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో సెంచరీ బాదిన సూర్య.. 890 రేటింగ్ పాయింట్స్ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. అంతకుముందు ఇంగ్లండ్‌తో 55 బంతుల్లో 117 పరుగులతో తొలి శతకం బాదాడు.

టీ20ల్లో సత్తా చాటిన సూర్యకుమార్ యాదవ్.. వన్డే క్రికెట్‌లో మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోతున్నాడు. శ్రీలంకతో చివరి వన్డేతో పాటు న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లోనూ విఫలమయ్యాడు. టీ20 ప్రదర్శనతో ఆస్ట్రేలియాయాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎంపిక చేసిన జట్టులో సూర్య చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌లో సత్తా చాటాలని సూర్య భావిస్తున్నాడు.
ఐసీసీ మహిళల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ తహిలా మెక్‌గ్రాత్ గెలుచుకుంది. గతేడాది 16 మ్యాచ్‌లు ఆడిన ఆమె 62.14 యావరేజ్‌తో 435 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 13 వికెట్లు పడగొట్టింది.