టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను దురదృష్టం వెంటాడుతోంది. రెడ్ బాల్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలనే లక్ష్యంతో దేశవాళీ క్రికెట్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు ఊహించని షాక్ తగిలింది. తమిళనాడు వేదికగా జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
అతని కుడిచేతి బొటన వేలుకు గాయమైనట్లు ఎన్‌సీఏ వర్గాలు పేర్కొన్నాయి. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్య.. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. బంతి కుడిచేతి బొటన వేలికి బలంగా తాకింది. హుటాహుటినా సూర్య ఎన్‌సీఏకు వెళ్లి గాయాన్ని పరీక్షించుకున్నట్లు సమాచారం.

ప్రస్తుత గాయం కారణంగా సూర్యకుమార్ యాదవ్ దులీప్ ట్రోఫీ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 5 నుంచి అనంతపురం, బెంగళూరు వేదికగా దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుండటంతో.. బీసీసీఐ దులీప్ ట్రోఫీ నిబంధనలను మార్చింది.
సీనియర్ ఆటగాళ్లతో నాలుగు జట్లను విభజించి ఈ టోర్నీని నిర్వహిస్తోంది. ఈ టోర్నీలో సత్తా చాటిన ఆటగాళ్లకు భారత టెస్ట్ టీమ్‌లో అవకాశం దక్కనుంది. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్.. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి టెస్ట్ టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించాడు. బీసీసీఐ ప్రకటించిన జట్లలో సూర్యకుమార్ యాదవ్ టీమ్ సీలో ఉన్నాడు. ఇప్పటికే దులీప్ ట్రోఫీ నుంచి అనివార్య కారణాల వల్ల మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ తప్పుకున్నారు.
బరిలోకి దిగే నాలుగు జట్లు..
టీమ్ ఏ: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్ర, శస్వాత్ రావత్.
టీమ్ బీ: అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవాస్థి, ఎన్ జగదీషన్(కీపర్).
టీమ్ సీ: రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటీదార్, రజత్ పటీదార్, అభిషేక్ ఫోరల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, బీ ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మనవ్ సుథార్, ఉమ్రాన్ మాలిక్, వైశాఖ్ విజయ్‌కుమార్, అన్షుల్ కంబోజి, హిమాన్ష చౌహన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్, సందీప్ వారియర్.
టీమ్ డీ: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ టైడ్, యశ్ దుబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, రికీ భుయ్, సరాన్ష్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాక్రే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సెంగుప్తా, కేఎస్ భరత్, సౌరభ్ కుమార్.