Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2025: చిక్కుల్లో సూర్యకుమార్ యాదవ్..?

ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్థాన్‌‌ను టీమిండియా చిత్తు చేసింది. ఆదివారం దుబాయ్ వేదికగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే ఆటగాళ్ల షేక్ హ్యాండ్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విజయానంతరం భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్స్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు.

భారత ఆటగాళ్ల తీరుతో ఖంగుతిన్న పాకిస్థాన్ ప్లేయర్లు నిరాశగా మైదానం వీడారు. భారత ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి మరి డోర్ వేసుకున్నారు. ఈ వ్యవహరంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సూర్య సేన చేసిన పనిని కొందరు కొనియాడుతుంటే.. మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. ఆటను ఆటలా చూడాలని హితవు పలుకుతున్నారు.

దిద్దుబాటు చర్యలా..?

అయితే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని మెజార్టీ క్రికెట్ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో బీసీసీఐపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. జవాన్ల రక్తం కంటే బీసీసీఐ డబ్బులే ఎక్కువయ్యాయనే మాటలు వినిపించాయి. బీసీసీఐనే కాదు భారత ప్రభుత్వంపై కూడా విమర్శలు వచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల నేపథ్యంలో నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని, పాక్‌తో ఎలాంటి సంబంధాలు ఉండవని భారత ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఐసీసీ, ఏసీసీ రూల్స్ ప్రకారమే మల్టీ నేషనల్ ఈవెంట్స్‌లో పాక్‌తో భారత్ ఆడుతుందని ఇటీవల వెల్లడించింది. ఈ ద్వంద వైఖరిని పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలు తప్పుబట్టాయి. పాక్‌తో మ్యాచ్ ఆడవద్దని ఆవేదన వ్యక్తం చేశాయి.

Suryakumar Yadav Likely to Face ICC Action for Comments on Pahalgam Attack in Asia Cup 2025

బీసీసీఐ ఆదేశాల ప్రకారమే..

మరోవైపు సోషల్ మీడియా వేదికగా భారత్-పాక్ మ్యాచ్‌ను బాయ్‌కట్ చేయాలని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాంతో ఎన్నడూ లేని విధంగా దాయాదుల పోరుకు ప్రేక్షకాదరణ లభించలేదు. స్టేడియంలో చాలా వరకు సీట్లు ఖాళీగా కనిపించాయి. ఈ ఘటనల నేపథ్యంలో బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టిందని, అందులో భాగంగానే షేక్ హ్యాండ్ డ్రామాకు తెరలేపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పాక్‌పై విజయాన్ని భారత సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు సూర్య చెప్పడం కూడా బీసీసీఐ ఆదేశాల ప్రకారమే జరిగిందని పేర్కొంటున్నారు.

ఐసీసీ చర్యలు తీసుకుంటుందా..?

దేశ ప్రజలు, జవాన్లపై ప్రేమ ఉంటే పాక్‌తో మ్యాచ్ ఆడాల్సింది కాదని అభిప్రాయపడుతున్నారు. ఇక సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఐసీసీ రూల్స్‌కు విరుద్దమనే వాదన కూడా వినిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో పొలిటికల్ కామెంట్స్ చేయడం రూల్స్‌కు విరుద్దం. అయితే సూర్య చేసిన వ్యాఖ్యలను పొలిటికల్ కామెంట్స్‌గా చూస్తారా? అనేది చూడాలి. ఒకవేళ పొలిటికల్ కామెంట్స్‌గా పరిగణలోకి తీసుకుంటే అతనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. భారీ జరిమానాతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించాలి. కానీ భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే దమ్ము ఐసీసీకి లేదు.

Story first published: Monday, September 15, 2025, 21:10 [IST]
Other articles published on Sep 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+