Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Surya Kumar Yadav: రోహిత్ శర్మ క్లాస్ ప్లేయర్.. అతని ఆటను ప్రపంచం మొత్తం చూస్తోంది!

Suryakumar Yadav lauds captain Rohit Sharma, says He is a class player

కోల్‌కతా: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంలో సూర్యకుమార్ యాదవ్‌(34 నాటౌట్)తో పాటు రోహిత్ శర్మ(42) కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ తమ కెప్టెన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

రోహిత్ కోసం..

రోహిత్ కోసం..

'రోహిత్‌ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచం మొత్తం అతని బ్యాటింగ్‌ చూస్తోంది. రోహిత్‌ ఒక అ‍ద్భుతమైన ఆటగాడు. ఇన్నాళ్లూ ఎలా దూకుడుగా ఆడాడో, ఈ మ్యాచ్‌లో కూడా అదే విధంగా ఆడాడు. అతని బ్యాటింగ్‌లో ఎటు వంటి మార్పు కనిపించడం లేదు. రోహిత్‌ శర్మ పవర్‌ప్లేలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చెమటలు పట్టిస్తాడు. అదే విధంగా అతడికి ఒక సారథిగా జట్టును విజయ పథంలో నడిపించే సత్తా ఉంది" అని సూర్య చెప్పుకొచ్చాడు.

అవసరమైతే బౌలింగ్ చేస్తా..

అవసరమైతే బౌలింగ్ చేస్తా..

టీమ్ కోసం అవసరమైతే బౌలింగ్ చేయడానికి కూడా తాను సిద్దంగా ఉన్నానని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 'జట్టు కోసం అవసరమైతే బౌలింగ్ చేసేందుకు రెడీ. బౌలర్లు నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేస్తున్నప్పుడు వారికి బౌలింగ్ చేస్తూ మెలుకువలు నేర్చుకుంటున్నాను. దాంతో పాటు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి ఆఖరి వరకు క్రీజులో ఉండటం చాలా ముఖ్యమని నేను భావిస్తాను. జట్టు విజయానికి మరో 20-25 పరుగుల దూరంలో ఉన్నప్పుడు ఔటైతే చాలా బాధగా ఉంటుంది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వెంకటేశ్ అయ్యర్ పూర్తి సానుకూల దృక్పథంతో ఆడతాడు. అతని నుంచి చక్కటి మద్దతు లభించింది. మేమిద్దరం ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టుని గెలిపించాలనుకున్నాం'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.

భళా బిష్ణోయ్..

భళా బిష్ణోయ్..

అరంగేట్ర మ్యాచ్‌లోనే రవి బిష్ణోయ్ అదరగొట్టాడని సూర్య కితాబిచ్చాడు. 'ఫస్ట్ మ్యాచ్‌లోనే రవి బిష్ణోయ్ అదరగొట్టాడు. టీ20 ఫార్మాట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమమైన జట్టుపై అరంగేట్రం చేసే గొప్ప అవకాశం అతనికి దక్కింది. ఆరంభంలో కొంచెం తడబడినా.. ఆ తర్వాత పుంజుకున్నాడు. తన వ్యూహాలను పక్కాగా అమలు చేసి.. విజయవంతమయ్యాడు. మరోవైపు, ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర జట్లలో వెస్టిండీస్ ఒకటి. అందుకే, ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన విండీస్‌ను తక్కువ అంచనా వేయలేం. సిరీస్ నిర్ణయాత్మక రెండో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనుకుంటున్నాను'అని సూర్యచెప్పుకొచ్చాడు.

వరుసగా వికెట్లు పడ్డా..

వరుసగా వికెట్లు పడ్డా..

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ధాటిగా ఆడటంతో టీమిండియా శుభారంభం అందుకుంది. అయితే ఓవర్ల వ్యవధిలోనే రోహిత్, కిషాన్, కోహ్లీ, పంత్ ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ వెంకటేశ్ అయ్యర్‌(24)తో కలిసి సూర్యకుమార్ యాదవ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. వీరిద్దరూ కలిసి 26 బంతుల్లో 48 పరుగుల భాగస్వామ్యం అందించారు.

Story first published: Thursday, February 17, 2022, 19:34 [IST]
Other articles published on Feb 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+