For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Suryakumar Yadav ఆ కోహ్లీ రికార్డు జస్ట్ మిస్.. చివరి ఓవర్లో స్ట్రయికింగ్ వచ్చి ఉంటే..!

SuryaKumar Yadav just misses Virat Kohli highest Individual T20 Score record

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా సహచర ఆటగాళ్లతో పాటు మాజీ క్రికెటర్లు, అభిమానులు సూర్యను సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో సూర్య(51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతనికి ధాటికి వర్షం కూడా పారిపోయింది. కివీస్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడిన సూర్య.. మెల్లగా ఆరంభించి ఆ తర్వాత విశ్వరూపం చూపించాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మిస్టర్ 360.. మరో 17 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.

రికార్డుల మోత..

రికార్డుల మోత..

సూర్యకుమార్ యాదవ్‌కు అంతర్జాతీయ టీ20ల్లో ఇది రెండో శతకం కాగా.. రెండు సెంచరీలు విదేశాల్లోనే చేయడం విశేషమైతే ఈ ఏడాదే అందుకోవడం గమనార్హం. టీ20 ఫార్మాట్లో తొలి శతకాన్ని సూర్య ఇంగ్లండ్‌పై నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో సూర్య తన పేరిట పలు రికార్డులను లిఖించుకున్నాడు.

న్యూజిలాండ్‌తో మ్యాచ్ 11 ఫోర్లు, 7 సిక్సులు బాదిన సూర్య.. 200కిపైగా సగటుతో పరుగులు రాబట్టాడు. ఏడో ఫోర్ బాదగానే.. ఈ క్యాలెండర్ ఇయర్లో 100 బౌండరీలను పూర్తి చేసుకున్నాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ టీ20ల్లో సూర్య 11 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. 2021లో 13 హాఫ్ సెంచరీలు చేసిన రిజ్వాన్ మాత్రమే సూర్య కంటే ముందున్నాడు. 2021లో బాబర్ ఆజమ్ పది హాఫ్ సెంచరీలు చేయగా.. ఈ ఏడాది రిజ్వాన్ ఇప్పటి వరకూ 10 అర్ధ శతకాలు నమోదు చేశాడు.

చివరి ఓవర్‌లో బ్యాటింగ్ చేసుంటే..

చివరి ఓవర్‌లో బ్యాటింగ్ చేసుంటే..

సూర్య అంతర్జాతీయ టీ20ల్లో ఈ ఏడాది ఇప్పటి వరకూ 1151 పరుగులు చేశాడు. మరో 176 పరుగులు చేస్తే.. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మహ్మద్ రిజ్వాన్ (1326)ను సూర్య వెనక్కి నెడతాడు. టీ20ల్లో భారత్ తరఫున హయ్యెస్ట్ స్కోర్ చేసిన బ్యాటర్‌గా రికార్డ్ విరాట్ కోహ్లి పేరిట ఉంది. ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై కోహ్లి 122 పరుగలతో నాటౌట్‌గా నిలిచాడు. కివీస్‌తో మ్యాచ్‌‌లో ఆఖరి ఓవర్లో సూర్యకు స్ట్రయికింగ్‌ చేసే అవకాశం వచ్చి ఉండుంటే.. కచ్చితంగా కోహ్లిని దాటేసేవాడు.

వీడియో గేమ్ ఇన్నింగ్స్..

వీడియో గేమ్ ఇన్నింగ్స్..

వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ అని సూర్య మరోసారి నిరూపించుకున్నాడని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. 'ఈ మ్యాచ్ లైవ్‌లో చూడలేదు కానీ.. కచ్చితంగా చెప్పగలను.. సూర్యకు ఇది మరో వీడియో గేమ్ ఇన్నింగ్స్'అని పేర్కొన్నాడు. హర్షా భోగ్లే సైతం సూర్య ఇన్నింగ్స్‌తో ఊపిరి పీల్చుకోలేకపోయానన్నాడు. సెహ్వాగ్ అయితే ఆకాశం మొత్తం నిప్పులు చెరుగుతున్నాయనే మీమ్‌ను షేర్ చేశాడు. అసాధారణమైన ఇన్నింగ్స్ అంటూ ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు.

Story first published: Sunday, November 20, 2022, 18:32 [IST]
Other articles published on Nov 20, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+