Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2026: మా ఓపెనర్ అతనే: సూర్యకుమార్ యాదవ్ 

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాతో జరిగే తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడని తెలిపాడు. న్యూజిలాండ్, సౌతాఫ్రికాతోనే కాకుండా దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ఇషాన్ కిషన్ సత్తా చాటాడని సూర్యకుమార్ యాదవ్ గుర్తు చేశాడు.

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. తిలక్ వర్మ గైర్హాజరీలో తుది జట్టులో అవకాశం అందుకున్న ఇషాన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20లో శతకం బాదిన ఇషాన్ కిషన్.. సౌతాఫ్రికాతో వామప్ మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీతో రాణించి నిలకడను చాటుకున్నాడు. మరోవైపు న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో దారుణంగా విఫలమైన సంజూ శాంసన్ తుది జట్టులో చోటు కోల్పోయాడు.

అతని దూకుడు జట్టుకు అవసరం..

తిలక్ వర్మ రీఎంట్రీ ఇవ్వడంతో సౌతాఫ్రికాతో వామప్ మ్యాచ్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్ ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ఆడించింది. మూడో స్థానంలో ఆడిన తిలక్ వర్మ కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. దాంతో సంజూ బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాతో మ్యాచ్ నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్‌ను ఓపెనింగ్ స్లాట్ గురించి ప్రశ్నించగా.. ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతాడని చెప్పాడు. అతని దూకుడైన బ్యాటింగ్‌తో జట్టుకు ఎంతో ప్రయోజకరమవుతుందని అభిప్రాయపడ్డాడు.

Suryakumar Yadav Hints Ishan Kishan to Open for India vs USA in T20 World Cup 2026

'గత కొన్ని మ్యాచ్‌ల్లో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ సత్తా చాటాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ దూకుడుగా ఆడి తన జట్టును విజేతగా నిలబెట్టాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. వార్మప్ మ్యాచ్‌లో మాత్రం ఓపెనర్‌గా వచ్చాడు. అతను ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా అదే దూకుడు కొనసాగించాలని కోరుకుంటున్నాను. అయితే ఫస్ట్ డౌన్ కంటే దిగువ స్థానంలోఅయితే బ్యాటింగ్ చేయడు. ఏ స్థానంలో ఆడించినా.. తన జోరు కొనసాగిస్తాడని ఆశిస్తున్నా.’అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

సంజూ బెంచ్‌కే..

ఇటీవల న్యూజిలాండ్‌‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 46 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 24 మాత్రమే. 2025 నుంచి టీ20ల్లో ఓపెనర్‌గా అతను 11 ఇన్నింగ్స్‌లలో 12.18 సగటుతో కేవలం 134 పరుగులు మాత్రమే సాధించాడు, అత్యధిక స్కోరు 37. మరోవైపు ఇషాన్ కిషన్.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 53.75 సగటు, 231.18 స్ట్రైక్‌రేట్‌తో 215 పరుగులు చేశాడు.

రెండో టీ20లో 32 బంతుల్లో 76 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయగా.. ఆఖరి టీ20లో 43 బంతుల్లో 103 పరుగులతో చెలరేగాడు. సౌతాఫ్రికాతోనూ వామప్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. తిలక్ వర్మ కూడా సత్తా చాటడంతో సంజూ బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Story first published: Friday, February 6, 2026, 19:25 [IST]
Other articles published on Feb 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+