Abhimanyu Easwaran: 26 సెంచరీలా..? వాటే ప్లేయర్: సూర్యకుమార్ యాదవ్
భారత దేశవాళీ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్‌పై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రతిష్టాత్మక ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిమన్యు ఈశ్వరన్.. రంజీ ఛాంపియన్ ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో అజేయం శతకంతో సత్తా చాటాడు. మరో ఎండ్‌లో సహకారం లేకపోయినా అద్వితీయమైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు.
అభిమన్యు ఈశ్వరన్‌కు ఇది 25వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. ఇప్పటి వరకు 97 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అభిమన్యు ఈశ్వరన్.. 48.44 సగటుతో 7,315 పరుగులు చేశాడు. ఇందులో 29 హాఫ్ సెంచరీలతో పాటు 25 శతకాలు ఉన్నాయి. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నా.. అతనికి టీమిండియా తరఫున ఆడే అవకాశం దక్కలేదు. పలుమార్లు టీమిండియా పిలుపు అందుకున్నా.. అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. టీమిండియా టాపర్డర్‌లో ఖాళీ లేకపోవడంతో అభిమన్యు ఈశ్వరన్‌కు అవకాశం లభించడం లేదు.

అభిమన్యు ఈశ్వరన్ ఫైటింగ్ సెంచరీకి ఫిదా అయిన సూర్యకుమార్ యాదవ్.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'వాటే ప్లేయర్.. టాప్ మ్యాన్'అనే క్యాప్షన్‌తో అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ పోజ్ ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు. అభిమన్యు ఈశ్వరన్ క్రికెట్ ప్రయాణం గురించి వివరిస్తూ షేర్ చేసిన ఓ పోస్ట్‌కు రిషభ్ పంత్ రిప్లే ఇచ్చాడు. అసాధారణమైన ప్రయాణమని రాసుకొచ్చాడు.
అభిమన్యు ఈశ్వరన్(212 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 151 బ్యాటింగ్) అజేయ శతకంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెస్టాఫ్ ఇండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 74 ఓవర్లలో 4 వికెట్లకు 289 పరుగులు చేసింది. ఈశ్వరన్‌తో పాటు క్రీజులో ధ్రువ్ జురెల్(30 బ్యాటింగ్) ఉన్నాడు. రెస్టాఫ్ ఇండియా ఇంకా 248 పరుగుల వెనుకంజలో ఉంది.
ముంబై బౌలర్లలో మోహిత్ అవాస్థి(2/66) రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ జునేద్ ఖాన్, తనుష్ కోటియన్ తలో వికెట్ తీసారు. 536/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ముంబై మరో మూడు ఓవర్లు మాత్రమే ఆడి ఒక పరుగు మాత్రమే జోడించి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది
141 ఓవర్లలో 537 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్(286 బంతుల్లో 25 ఫోర్లు, 4 సిక్స్‌లతో 222 నాటౌట్) అజేయ ద్విశతకంతో రాణించగా.. అతనికి తనూష్ కోటియన్(124 బంతుల్లో 6 ఫోర్లతో 64) అండగా నిలిచాడు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముఖేష్ కుమార్(5/110) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. యశ్ దయాల్(2/89), ప్రసిధ్ కృష్ణ(2/102) రెండేసి వికెట్లు పడగొట్టారు. సరాన్ష్ జైస్(1/82)కు ఓ వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications