Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను రోహిత్ శర్మలా తయారయ్యా: సూరీడు (వీడియో)

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మాటలతో నవ్వులు పూయించాడు. మతిమరుపు విషయంలో తాను రోహిత్ శర్మలా తయారయ్యానని తెలిపాడు. చిన్న చిన్న విషయాలు గుర్తుంచుకోలేకపోతున్నానని చెప్పాడు. ఆసియా కప్ 2025లో భాగంగా ఒమన్‌తో మ్యాచ్‌లో టాస్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ వెంటనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సూపర్ -4 మ్యాచ్‌లకు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. ఈ మ్యాచ్ ద్వారా తమ బ్యాటర్లను పరీక్షించాలనుకుంటున్నామని చెప్పాడు. ఈ మ్యాచ్‌కు తుది జట్టులో రెండు మార్పులు చేశామని తెలిపాడు. దాంతో ఏ ఆటగాళ్లను మార్చారని హోస్ట్ రవి శాస్త్రి ప్రశ్నించగా.. ఆటగాళ్ల పేర్లు చెప్పేందుకు సూర్యకుమార్ యాదవ్ ఇబ్బంది పడ్డాడు. అతి కష్టం మీద హర్షిత్ రాణా పేరు చెప్పిన సూర్య.. మరో ఆటగాడు ఎవరో తెలియదని, తాను కూడా రోహిత్ శర్మలా తయారయ్యానని నవ్వుతూ బదులిచ్చాడు.

Suryakumar Yadav Forgets India s Playing XI Changes at Toss Jokingly Compares Himself to Rohit Sharma

'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మేం ముందుగా బ్యాటింగ్ చేయలేదు. మా బ్యాటర్ల సత్తా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం. సూపర్-4‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ లభించడం కలిసొచ్చే అంశం. తొలి రెండు మ్యాచ్‌ల తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ రాణించాలనుకుంటున్నాం. అదే జోరును కొనసాగించాలనుకుంటున్నాం. పిచ్ బాగుంది. మా ఓపెనర్లు మరింత బాగా అంచనా వేయగలరు.

తుది జట్టులో రెండు మార్పులు చేశాం. హర్షిత్ రాణా జట్టులోకి రాగా.. మరో ఆటగాడు ఎవరో మరిచిపోయాను. నేను కూడా రోహిత్‌లా తయారయ్యాను.'అని సూర్యకుమార్ యాదవ్ నవ్వుతూ చెప్పాడు. గతంలో టాస్ సందర్భంగా టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ చాలా సార్లు జట్టులో చేసిన మార్పుల గురించి చెప్పేందుకు తడబడ్డాడు.

సాధారణంగా టాస్ గెలిస్తే ఒక కాంబినేషన్.. ఓడితే మరో కాంబినేషన్‌తో బరిలోకి దిగాలని టీమ్ సమావేశం నిర్ణయించుకుంటారు. చివరి క్షణంలోనూ పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు తుది జట్టులో మార్పులు చేస్తారు. దాంతోనే మారిన ఆటగాళ్ల గురించి చెప్పేందుకు కెప్టెన్లు ఇబ్బంది పడుతుంటారు. ఈ మ్యాచ్‌ నుంచి జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీలకు విశ్రాంతి ఇచ్చి అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాకు అవకాశం కల్పించారు.

తుది జట్లు:

ఒమన్ : ఆమిర్ కాలీమ్, జతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), షా ఫైసల్, జిక్రియా ఇస్లాం, ఆర్యన్ బిష్ట్, మహమ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ, జితెన్ రమనాండి.

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.

Story first published: Friday, September 19, 2025, 21:39 [IST]
Other articles published on Sep 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+