ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. డ్యూ కండిషన్స్‌లో తమ బౌలర్ల సత్తాను పరీక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. తుది జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన సూర్యకుమార్ యాదవ్.. అక్షర్ పటేల్‌కు విశ్రాంతి ఇచ్చామని పేర్కొన్నాడు.
టీమిండియా కాంబినేషన్‌లో భాగంగా కుల్దీప్ యాదవ్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడని తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నాం. పిచ్ బాగుంది. మేము బోర్డుపై పరుగులు ఉంచి.. ఆపై ఆ స్కోరును కాపాడుకోవాలనుకుంటున్నాం. తద్వారా మా బౌలర్లపై ఒత్తిడి పెంచాలనుకుంటున్నాం. జట్టులో వాతావరణం చాలా బాగుంది. నేను కోరుకున్న విధంగానే ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని ఆడుతున్నారు. మా జట్టులో రెండు మార్పులు చేశాం. కుల్దీప్ స్థానంలో అర్ష్‌దీప్ వచ్చాడు. అక్షర్‌కు విశ్రాంతిని ఇచ్చి వాషింగ్టన్ సుందర్‌ను తీసుకున్నాం.'అని సూర్య తెలిపాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ అన్నాడు. 'మేం కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఇది మంచి వికెట్‌లా కనిపిస్తోంది. మా క్యాంపైన్‌ను ఘనంగా ముగించడమే మా లక్ష్యం. ఈ రోజు సమష్టి ప్రదర్శన ఇవ్వాలని చూస్తున్నాం. మా జట్టులో ఒక మార్పు చేశాం.'అని ఎడ్వర్డ్స్ చెప్పుకొచ్చాడు.
ఇప్పటికే సూపర్-8 చేరిన భారత్.. ఈ మ్యాచ్ గెలిచి అజేయంగా లీగ్ దశను ముగించాలనే లక్ష్యంతో ఉంది. సూపర్ 8 మ్యాచ్‌లకు సన్నాహకంగా ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాలనుకుంటుంది.
నెదర్లాండ్స్: మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడే, కోలిన్ అకెర్‌మన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్/వికెట్ కీపర్), జాక్ లయన్-కాచెట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్, నోహ్ క్రోస్.
భారత్ : ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.