ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. డ్యూ ఫ్యాక్టర్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సౌతాఫ్రాకి టీ20 కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ అన్నాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో మంచు కురిసే అవకాశం ఉంది. అదే జరిగితే కండిషన్స్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతాయి.
ఈ మ్యాచ్ గెలవడానికి మాకు మంచి అవకాశాలు ఉన్నాయి. మా ఫోకస్ అంతా ప్రపంచకప్‌పైనే ఉంది. మేం ఇక్కడ ఇంకొన్ని మ్యాచ్‌లు ఆడబోతున్నాం. మా బౌలింగ్‌లో కొన్ని మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పర్యటనను విజయంతో ముగించాలని ఆశిస్తున్నాం. నోకియా స్థానంలో లిండే తుది జట్టులోకి వచ్చాడు.'అని మార్క్‌రమ్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిచినా తాము ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. వికెట్ బాగుంది. ఇక్కడ మంచు కురిసే అవకాశం లేదు. కాబట్టి భారీ లక్ష్యం నమోదు చేయాలని భావిస్తున్నాం. ప్రేక్షకులతో స్టేడియం నిండిపోయింది. ఈ మ్యాచ్ నుంచి మేం ఏం ఆశిస్తున్నామో తర్వాత తెలుస్తోంది. సిరీస్ డిసైడర్ మ్యాచ్ ఇది.
మా ఆటను మేం ఆస్వాదించే ప్రయత్నం చేస్తాం. తుది జట్టులో మూడు మార్పులు చేశాం. హర్షిత్ రాణా స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ జట్టులోకి వచ్చాడు. లక్నోలో శుభ్‌మన్ గిల్‌కు చిన్న గాయమైంది. దాంతో అతని స్థానంలో సంజూ శాంసన్ బరిలోకి దిగుతున్నాడు.'అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.
ఈ ఐదు టీ20ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని సౌతాఫ్రికా భావిస్తోంది.
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), డేవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనovan ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, కోర్బిన్ బాష్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.