For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Oman: అందుకే ఆ ఇద్దర్నీ పక్కన పెట్టాం: సూర్యకుమార్ యాదవ్

ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ముందుగా బ్యాటింగ్ చేయలేదని, అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నానని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. తమ బ్యాటర్ల సత్తా ఏంటో తెలుసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.

'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మేం ముందుగా బ్యాటింగ్ చేయలేదు. మా బ్యాటర్ల సత్తా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం. సూపర్-4‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ లభించడం చాలా కీలకం. తొలి రెండు మ్యాచ్‌ల తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ రాణించాలనుకుంటున్నాం. అదే జోరును కొనసాగించాలనుకుంటున్నాం. పిచ్ బాగుంది. మా ఓపెనర్లు మరింత బాగా అంచనా వేయగలరు.

Suryakumar Yadav Explains India s Playing XI Changes Against Oman Prioritizing Fitness and Batting Practice
Photo Credit: BCCI(X)

తుది జట్టులో రెండు మార్పులు చేశాం. హర్షిత్ రాణా జట్టులోకి రాగా.. మరో ఆటగాడు ఎవరూ మరిచిపోయాను. నేను రోహిత్‌లా తయారయ్యాను.'అని సూర్యకుమార్ యాదవ్ నవ్వుతూ చెప్పాడు. ఈ మ్యాచ్‌కు జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ దూరంగా ఉండగా.. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు తుది జట్టులోకి వచ్చారు. బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేసినట్లు సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

టాస్ గెలిస్తే తాను కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాడినని ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ తెలిపాడు. 'నేను కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాడిని. ఈ టోర్నీ మాకు గొప్ప అనుభవం. మా జట్టు పూర్తిగా కుర్రాళ్లతో నిండి ఉంది. మా ఆటగాళ్లకు అనువం తక్కువ. కానీ తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు ఈ టోర్నీ గొప్ప అవకాశం. భారత జట్టుతో కలిసి ఆడటం గొప్ప అవకాశం. మా జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి.'అని జతిందర్ సింగ్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

ఒమన్: ఆమిర్ కాలీమ్, జతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), షా ఫైసల్, జిక్రియా ఇస్లాం, ఆర్యన్ బిష్ట్, మహమ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ, జితెన్ రమనాండి.

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.

Story first published: Friday, September 19, 2025, 19:52 [IST]
Other articles published on Sep 19, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+