Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: ఈ విజయం వారికి అంకితం: సూర్యకుమార్ యాదవ్

పాకిస్థాన్‌పై సాధించిన విజయాన్ని భారత సాయుధ బలగాలకు అంకితం చేస్తున్నట్లు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. పహల్గామ్ ఉగ్రదాడిలో అసువులు బాసిన బాధితుల కుటుంబాలకు తాము అండగా ఉంటామని, వారికి ఈ విజయంతో తమ సంఘీభావాన్నితెలియజేస్తున్నామని సూర్యకుమార్ పేర్కొన్నాడు. ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

నా రిటర్న్ గిఫ్ట్ ఇది..

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. తన పుట్టిన రోజున గెలవడం సంతోషంగా ఉందని చెప్పాడు. 'నా బర్త్‌డే సందర్భంగా భారత్‌కు నేను ఇచ్చే ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ ఇది. ఆఖరి వరకు క్రీజులో ఉండి విజయ లాంఛనాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను మేం మరో సాధారణ గేమ్‌లానే భావిస్తాం. ప్రతీ జట్టుతో మ్యాచ్‌కు ఎలా సిద్దమవుతామో ఈ మ్యాచ్‌కు అలానే రెడీ అయ్యాం. గతంలో ఇక్కడే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ మేం స్పిన్నర్లతోనే గెలిచాం. అక్కడి నుంచే స్పిన్నర్లను ఉపయోగించడం మొదలైంది. అంతేకాకుండా స్పిన్నర్లకు నేను బిగ్ ఫ్యాన్. వారిని జట్టులోకి తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో వారు మ్యాచ్‌పై పట్టు సాధించగలరు.

Suryakumar Yadav Dedicates India s Victory to Armed Forces Expresses Solidarity with Pahalgam Attack Victims

ఆ కుటుంబాలకు అండగా ఉంటాం..

ఇదే సరైన సమయం.. సందర్భం భావించి మా తరఫున ఒకటి చెప్పాలనుకుంటున్నా. పహల్గామ్ ఉగ్రదాడిలోని బాధితుల కుటుంబాలకు మేం అండగా ఉంటాం. వారికి మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. పాక్‌పై సాధించిన ఈ విజయాన్ని ఎంతో దైర్య సాహాసాలు చూపిన భారత సాయుధ బలగాలకు అంకితం చేయాలనుకుంటున్నాం. వారు ఇలానే స్ఫూర్తినిస్తూ ఉంటారని ఆశిస్తున్నాం. వారిని సంతోషపరిచే అవకాశం దొరికినప్పుడల్లా.. మైదానంలో గెలిచే ప్రయత్నం చేస్తాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌ను బాయ్‌కట్ చేయాలని హహల్గామ్ ఉగ్రదాడి బాధితుల కుటుంబాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో సూర్య ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.

సూరీడి బర్త్‌డే ఇన్నింగ్స్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. షాహీన్ షా అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్‌లతో 33 నాటౌట్) ఒక్కడే దూకుడుగా ఆడగా.. సాహిబ్జాదా ఫర్హాన్(44 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 40) ఆచితూచి ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/18) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/18), జస్‌ప్రీత్ బుమ్రా(2/28) రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ తీసారు.

అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 47 నాటౌట్), అభిషేక్ శర్మ(13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), తిలక్ వర్మ(31 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో సైమ్ అయుబ్(3/35) ఒక్కడే మూడు వికెట్లు తీసాడు.

Story first published: Monday, September 15, 2025, 0:09 [IST]
Other articles published on Sep 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+