Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: ముంబై ఇండియన్స్‌కు మరో స్టార్ ప్లేయర్ గుడ్ బై!

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌ ఆ జట్టు వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే అతను జట్టు నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. టీమ్‌లో కొనసాగలేనని సమాచారమిచ్చినట్లు వార్తలు వచ్చాయి. హార్దిక్ పాండ్యా‌ను ఇతర జట్టుకు ట్రేడింగ్ చేసి తమకు కావాల్సిన ఆటగాళ్లను తీసుకోవాలనే యోచనలో ముంబై ఇండియన్స్ ఉంది.

ఇప్పటికే సీఎస్‌కే, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో హార్దిక్ పాండ్యా ట్రేడ్ డీల్‌కు సంబంధించి ముంబై ఇండియన్స్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా ట్రేడ్ డీల్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.

గంభీర్‌తో గట్టెక్కావ్.. నీ పనైపోయింది సూరీడు!

గంభీర్‌తో గట్టెక్కావ్.. నీ పనైపోయింది సూరీడు!

లక్నోతో సూర్య ట్రేడ్ డీల్..?

ఇది ఇలా ఉండగానే సూర్యకుమార్ యాదవ్ ట్రేడ్ డీల్ వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగేందుకు సూర్యకుమార్ యాదవ్ సుముఖంగా లేడని, అతన్ని లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని తెలుస్తోంది. అయితే లక్నో జట్టులో చేరేందుకు సూర్య విముఖత చూపినట్లు సమాచారం. ముంబై ఇండియన్స్ నుంచి అతని నిష్క్రమణ ఖాయమైనప్పటికీ.. అతను ఏ జట్టులో చేరుతాడనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Suryakumar Yadav Could Leave Mumbai Indians Ahead of IPL 2027 After Poor Season Reports

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబర్చింది. 14 మ్యాచ్‌ల్లో పదింటిలో ఓడి పాయింట్స్‌ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా నిరాశపర్చాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 717 పరుగులు చేసిన సూర్య.. 2026 సీజన్‌లో మాత్రం 13 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీలతో 270 పరుగులే చేశాడు. అతని పేలవ ఫామ్‌ ముంబై విజయవకాశాలను దెబ్బతీసింది.

హార్దిక్‌ పాండ్యా‌ను అడ్డు పెట్టి ముంబై ఆ ఆటగాళ్లను టార్గెట్ చేస్తోంది: అశ్విన్

Also Read

హార్దిక్‌ పాండ్యా‌ను అడ్డు పెట్టి ముంబై ఆ ఆటగాళ్లను టార్గెట్ చేస్తోంది: అశ్విన్

ఈ నేపథ్యంలోనే సూర్యతో పాటు పలువురు కీలక ఆటగాళ్లను తొలగించాలని ముంబై మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. హార్దిక్ పాండ్యాను కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ట్రేడ్ చేసేందుకు చర్చలు జరుగుతుండగా.. సూర్య ట్రేడ్ డీల్‌పై క్లారిటీ లేదు. అయితే సూర్య నిష్క్రమణపై ముంబై ఇండియన్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో సూర్య.. టీమిండియా టీ20 కెప్టెన్సీతో పాటు జట్టులో కూడా చోటు కోల్పోయాడు.

Story first published: Friday, August 7, 2026, 16:49 [IST]
Other articles published on Aug 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+