Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: అందుకే అర్ష్‌దీప్‌ సింగ్‌ను తీసుకోలేదు: సూర్యకుమార్ యాదవ్

ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న హై ఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడింది. కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. పిచ్ స్లో వికెట్‌గా కనిపిస్తుందని, భారీ లక్ష్యాన్ని నమోదు చేయాలనే వ్యూహంతోనే బ్యాటింగ్ ఎంచుకున్నానని వివరణ ఇచ్చాడు.

'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. గత కొద్ది రోజులుగా మేము మంచి క్రికెట్ ఆడుతున్నాం. ఈ మ్యాచ్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఇది స్లో వికెట్‌లా కనిపిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసి స్కోర్ బోర్డుపై భారీ లక్ష్యాన్ని ఉంచాలనుకుంటున్నాం. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం. దాదాపు గత 20 రోజులుగా మేము ఇక్కడే ఉన్నాం. కాబట్టి ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డాం.'అని సల్మాన్ అలీ అఘా చెప్పుకొచ్చాడు.

Suryakumar Yadav Confirms Unchanged XI for Pakistan Clash Arshdeep Singh Remains on Bench
Photo Credit: X (twitter)

మరోవైపు టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకునేవాడినని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. దాంతో టాస్ ఓడినా తాము కోరుకున్నదే దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు. 'మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. టాస్ ఓడినా మేం కోరుకున్నదే దక్కినందుకు సంతోషంగా ఉంది.

గత మ్యాచ్‌లో ఈ పిచ్ పక్కనే ఉన్న వికెట్‌పై ఆడాం. అది మంచి వికెట్. రాత్రి పూట బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. వాతావరణం ఉక్కపోతగా ఉంది కాబట్టి మంచు కురుస్తుందని ఆశిస్తున్నాం. జట్టులో ఎలాంటి మార్పులు లేవు. విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించడంతోనే అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకోలేదనే విషయాన్ని సూర్య పరోక్షంగా తెలిపాడు.

తుది జట్లు:

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ.

పాకిస్థాన్: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మొహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ ఆఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్.

Story first published: Sunday, September 14, 2025, 19:49 [IST]
Other articles published on Sep 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+