For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతనే మా ఓటమిని శాసించాడు: సూర్యకుమార్ యాదవ్

ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజెల్ వుడ్ అసాధారణ ప్రదర్శనతో తమ ఓటమిని శాసించాడని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. పవర్ ప్లేలో అద్భుత బౌలింగ్‌తో తమను కట్టడి చేశాడని చెప్పాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా రాణించిన ఆసీస్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. 40 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది.

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. జోష్ హజెల్ వుడ్ కారణంగానే ఓటమి పాలయ్యామని చెప్పాడు.పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోతే తిరిగి కోలుకోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. 'జోష్ హజెల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు తీసి మమ్మల్ని కోలుకోలేని దెబ్బతీసాడు. అభిషేక్ శర్మకు కూడా అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే అభిషేక్ చాలా రోజులుగా తన జోరును కొనసాగిస్తున్నాడు.

Suryakumar Yadav Admits Early Collapse Against Josh Hazlewood Cost India in 2nd T20I Defeat

అతనికి తన ఆట ఏంటో, తన గుర్తింపు ఏంటో తెలుసు. ఆ పేరు చెక్కుచెదరకుండా రాణిస్తున్నాడు. అతను ఇదే జోరు కొనసాగిస్తాడని, మా కోసం ఇలాంటి ఇన్నింగ్స్‌లు మరెన్నో ఆడుతాడని ఆశిస్తున్నాం. మేం తొలి మ్యాచ్‌లో ఎలా ఆడామో అలానే ఆడాలనుకుంటున్నాం. ముందుగా బ్యాటింగ్ చేస్తే బాగా ఆడాలి. ఆపై వచ్చి ఆ లక్ష్యాన్ని కాపాడుకోవాలి.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. హర్షిత్ రాణా(33 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 35) అతనికి అండగా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇందులో ముగ్గురు బ్యాటర్లు ఖాతా కూడా తెరవలేదు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/13) మూడు వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ రెండేసి వికెట్లు తీసారు. మార్కస్ స్టోయినీస్ ఒక వికెట్ తీసాడు. పరిస్థితులను గౌరవించకుండా దూకుడుగా ఆడి భారత బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు.

అనంతరం ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లకు 126 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ మిచెల్ మార్ష్(26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. ట్రావిస్ హెడ్(15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/26), వరుణ్ చక్రవర్తీ(2/23), కుల్దీప్ యాదవ్(2/43) రెండేసి వికెట్లు తీసారు. పవర్ ప్లేలో కాస్త కట్టడిగా బౌలింగ్ చేసినా.. బ్యాటింగ్‌లో మరో 20 పరుగులు చేసినా ఫలితం మరోలా ఉండేది.

Story first published: Friday, October 31, 2025, 17:36 [IST]
Other articles published on Oct 31, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+