For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ముగ్గురే గెలిపించారు: సూర్యకుమార్ యాదవ్

తుది జట్టులో చేసిన మార్పులు ఫలించాయని, జట్టు కాంబినేషన్ సెట్ అయ్యిందని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. జట్టులోకి కొత్తగా వచ్చిన అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ‌లే అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించారని కొనియాడాడు.

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం హోబర్ట్ వేదికగా జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించిన భారత్ 5 వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్‌లపై ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా-అర్ష్‌దీప్ సింగ్‌లది అద్భతుమైన కాంబినేషన్ అని కొనియాడాడు. ఈ మ్యాచ్ గెలవడం కంటే టాస్ గెలవడం మరింత సంతోషాన్నిచ్చిందని చెప్పాడు.

Suryakumar Lauds Washi Jitesh and Arshdeep After India s Win Over Australia in 3rd T20I

'ఈ మ్యాచ్‌లో టాస్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. వరుసగా 19 లేదా 20 మ్యాచ్‌లు టాస్ ఓడిపోయాం. అందుకే ఆ పరంపరను ఛేదించడం ఆనందంగా ఉంది. ఈ రోజు టాస్ గెలవడం కూడా మా విజయానికి కలిసొచ్చింది. జట్టు ప్రదర్శన కూడా ఆనందాన్నిచ్చింది. తుది జట్టులో చేసిన మార్పులు ఫలించాయి. జట్టులోని ప్రతీ ఒక్కరు తీవ్రంగా కష్టపడుతున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వాషింగ్టన్ సుందర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతనికి జితేశ్ శర్మ బాగా సహకరించాడు. అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. జట్టు కాంబినేషన్ కుదిరినట్టు అనిపించింది.

బుమ్రా-అర్ష్‌దీప్ కాంబినేషన్ అద్భుతమైనది. టాపార్డర్‌లో శుభ్‌మన్ గిల్-అభిషేక్ తరహాలోనే ఈ ఇద్దరది గొప్ప జోడీ. బుమ్రా తన పనిని సైలెంట్‌గా చేసుకుంటూ పరుగులను కట్టడి చేస్తాడు. ఆ పరుగుల ఒత్తిడిని అర్ష్‌దీప్ మరో ఎండ్‌లో వికెట్ల ద్వారా ఉపయోగించుకుంటాడు. ఈ ఇద్దరి అత్యంత ప్రమాదకరమైన కాంబినేషన్. ఈ సిరీస్‌ను 1-1తో సెట్ చేశాం. నాలుగో టీ20 కోసం ఆసక్తిగా ఉన్నాం. మా కుర్రాళ్లంతా చాలా నమ్మకంగా ఉన్నారు. క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నారు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. అర్ష్‌దీప్ సింగ్(3/31) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/33) రెండు వికెట్లు తీయగా.. శివమ్ దూబే(1/43) ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసి గెలుపొందింది. వాషింగ్టన్ సుందర్(23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49 నాటౌట్), జితేష్ శర్మ(13 బంతుల్లో 3 ఫోర్లతో 22 నాటౌట్) రాణించారు.

Story first published: Sunday, November 2, 2025, 18:21 [IST]
Other articles published on Nov 2, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+