కోహ్లీ, రోహిత్ కాదు.. పాకిస్థానీల గుండెల్లో గుబులు పుట్టించిన భారత క్రికెటర్ అతనే!
ఈ ఏడాది (2025) కూడా భారత్ క్రికెట్‌లోకి ఎంతో మంది యువ ఆటగాళ్లు తారా జువ్వలా దూసుకొచ్చారు. తమకే సాధ్యమైన ఆటతీరుతో యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. ఎంతలా అంటే శత్రు దేశం పాకిస్థాన్‌లో కూడా చర్చించుకునే రేంజ్‌లో చెలరేగారు. ఈ ఏడాది భారత్, పాకిస్థాన్ జట్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ 2025 టోర్నీల్లో మొత్తం నాలుగు సార్లు తలపడ్డాయి. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
ఆసియా కప్ 2025లో మూడు మ్యాచ్‌లకు మూడు భారత జట్టే గెలిచింది. ఈ టోర్నీలో 25 ఏళ్ల అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 44.85 సగటు, 200 స్ట్రైక్ రేట్‌తో 314 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఒక మ్యాచ్‌లో 13 బంతుల్లో 31 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. మరొక మ్యాచ్‌లో 39 బంతుల్లోనే 74 పరుగులు చేసి పాకిస్థాన్ బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. దాంతో అతని పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.
ముఖ్యంగా పాకిస్థాన్ అభిమానులు అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యారు. అతని గురించి తెలుసుకునేందుకు తెగ ఆసక్తి కనబర్చారు. ఎంతలా అంటే పాకిస్థాన్‌లో గూగుల్ వేదికగా అత్యధికంగా సెర్చ్ చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పాకిస్థాన్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్-5 ఆటగాళ్లలో అభిషేక్ శర్మ మాత్రమే ఇతర దేశ ఆటగాడు.

ఈ ఏడాది(2025) పాకిస్థాన్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్ల జాబితా:
అభిషేక్ శర్మ (భారత క్రికెటర్)
హసన్ నవాజ్ (పాకిస్థాన్ క్రికెటర్)
ఇర్ఫాన్ ఖాన్ నియాజీ (పాకిస్థాన్ క్రికెటర్)
సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్ క్రికెటర్)
ముహమ్మద్ అబ్బాస్ (పాకిస్థాన్ క్రికెటర్)
టాప్ లేపిన టీనేజ్ సెన్సేషన్..
భారత్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆటగాళ్లలో టీనేజ్ సెన్సేషన్, 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాదే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. 35 బంతుల్లోనే సెంచరీ బాది ఈ ఘనతను అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఐపీఎల్ ప్రదర్శనతో ఐపీఎల్ అండర్ 19 జట్లకు ప్రాతినిథ్యం వహించిన సూర్యవంశీ అక్కడ కూడా సత్తా చాటాడు. ఈ జాబితాలోఅభిషేక్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు.
భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్-10 ప్రముఖుల్లో ఎక్కువమంది క్రికెటర్లే ఉన్నారు. మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలవడంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్, ఐపీఎల్ సెన్సేషన్స్ ప్రియాన్ష్ ఆర్య, షేక్ రషీద్, ఆయుష్ మ్హాత్రే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఈ ఏడాది(2025)భారత్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ప్రముఖుల జాబితా
వైభవ్ సూర్యవంశీ
ప్రియాన్ష్ ఆర్య
అభిషేక్ శర్మ
షేక్ రషీద్
జెమీమా రోడ్రిగ్స్
ఆయుష్ మ్హాత్రే
స్మృతి మంధాన
కరుణ్ నాయర్
ఉర్విల్ పటేల్
విఘ్నేష్ పుత్తూరు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications