Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 ఒక్కటే సరిపోదు.. అభిషేక్ శర్మకు సురేష్ రైనా కీలక సలహా!

టీమిండియా టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మకు మాజీ క్రికెటర్ సురేష్ రైనా కీలక సలహా ఇచ్చాడు. కేవటం టీ20 ఫార్మాటే కాకుండా రెడ్ బాల్ క్రికెట్ కూడా ఆడాలని సూచించాడు. రెడ్ బాల్ క్రికెట్ ఆడటం వల్ల సహనం పెరుగుతుందని, ఆట మరింత మెరుగవుతుందని అభిప్రాయపడ్డాడు. అభిషేక్ శర్మ కేవలం టీ20 ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు.

టీ20 స్పెషలిస్ట్ ఓపెనర్‌గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న అభిషేక్ శర్మ.. దేశవాళీ క్రికెట్‌లోనూ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. 2024 ఫిబ్రవరి నుంచి అతను ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పటి వరకు 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 30.6 సగటుతో 1000కి పైగా పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Suresh Raina Urges India T20I Specialist Opener Abhishek Sharma to Play Test Cricket for India

తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ రైనా.. అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. అభిషేక్ సహచరుడు, యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఆడుతున్నందున, టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి రావాలని రైనా సూచించాడు.

'అభిషేక్ శర్మ టెస్ట్ క్రికెట్‌ ఆడాలి. ఐపీఎల్ మేనేజ్‌మెంట్, క్రికెట్ అసోసియేషన్స్, కోచ్‌లు యువ ప్లేయర్లలో టెస్ట్ క్రికెట్‌పై ఆసక్తిని పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ఇటీవల ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలో జోఫ్రా ఆర్చర్ వంటి బౌలర్ల బౌలింగ్‌లో అభిషేక్ శర్మ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. అతను టెస్ట్ క్రికెట్ ఆడితే.. మైదానంలో ఎక్కువ సమయం గడిపే ఓర్పు పెరుగుతుంది. దాంతో షాట్ సెలెక్షన్, టీ20 ఆట మరింత మెరుగవుతాయి.'అని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, September 7, 2026, 15:28 [IST]
Other articles published on Sep 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+