Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: రింకూ.. ఇంగ్లీష్ మస్త్ మాట్లాడుతున్నావ్! అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నావా? (వీడియో)

కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) యువ సంచలనం రింకూ సింగ్‌ను టీమిండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, పార్దీవ్ పటేల్ ఓ ఆట ఆడుకున్నారు. అతని ఇంగ్లీష్‌పై జోకులు పేల్చారు. ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లో కేకేఆర్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో గెలిచి మూడో సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.

ఈ మ్యాచ్‌కు హిందీ కామెంటేర్లుగా వ్యవహరించిన సురేశ్ రైనా, పార్దీవ్ పటేల్.. మ్యాచ్ అనంతరం రింకూ సింగ్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా రింకూ సింగ్ ఇంగ్లీష్ బాగా మెరుగైందని పార్దీవ్ పటేల్ అన్నాడు. 'రింకూ సింగ్ బయట కూర్చొని నిన్ను చూస్తుంటే మాకు ఒక విషయం అర్థమైంది. నీ ఇంగ్లీష్ బాగా మెరుగైనట్లుంది.'అని పార్దీవ్ పటేల్ ప్రశ్నించాడు.

Suresh Raina Teases Rinku Singh After KKR s Win In IPL 2024 Final vs SRH Video Goes Viral

దీనికి రింకూ సింగ్ నవ్వుకుంటూనే.. ఇంగ్లీస్(ఇంగ్లీష్)? నా ఇంగ్లీస్(ఇంగ్లీష్) ఇంకా మెరుగవ్వలేదు'అని బదులిచ్చాడు. ఆ వెంటనే సురేశ్ రైనా.. 'ఔట్ సైడ్ నుంచి నీకు వచ్చే మెసేజ్‌లను ఎలా కంట్రోల్ చేస్తున్నావ్? బయటి నుంచి నిన్ను ఇష్టపడేవాళ్లు చాలా ఉంటారు?'అని ప్రశ్నించాడు. దానికి రింకూ సింగ్ నవ్వుతూనే.. నాకంత అటెన్షన్ లేదని తెలిపాడు. మామలుగానే డీల్ చేస్తానని చెబుతుండగా.. సురేశ్ రైనా హో హో..అని నవ్వుతూ అరిచాడు. దాంతో ముగ్గురు విరగబడి నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఐపీఎల్ 2024 సీజన్‌లో రింకూ సింగ్ అంచనాలను అందుకోలేకపోయాడు. తమ జట్టు సూపర్ ఫామ్ నేపథ్యంలో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశాలు పెద్దగా రాలేదు. వచ్చిన అవకాశాల్లో కూడా అతను పెద్దగా రాణించింది లేదు. 14 మ్యాచ్‌ల్లో 168 పరుగులే చేశాడు. టీ20 ప్రపంచకప్‌ 2024 ఎంపిక చేసిన భారత జట్టులో రింకూ సింగ్‌కు చోటు దక్కలేదు. స్టాండ్ బై ప్లేయర్‌గా అతను అమెరికాకు వెళ్లనున్నాడు.

Story first published: Monday, May 27, 2024, 18:44 [IST]
Other articles published on May 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+