For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మా మామను అతి కిరాతకంగా చంపారు.. హంతకులను వదలవద్దు: సురేశ్ రైనా

Suresh Raina talks about his Uncles Horrible Death and requests Punjab police to catch the killers
IPL 2020 Updates : Suresh Raina వైదొలగడానికి కారణాలు | Chennai Super Kings || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ సురేశ్ రైనా ట్విటర్ వేదికగా స్పందించాడు. కరోనా భయం, కుటుంబంపై బెంగ, సన్నిహితుల మరణం... ఫ్రాంచైజీతో విభేదాలు.. రైనా నిష్క్రమణకు కారణాలంటూ ప్రచారం జరిగింది. అయితే భారత్‌కు చేరుకున్న రైనా మంగళవారం తన నిష్క్రమణకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

ముందుగా పంజాబ్‌లో తన మేనత్త కుటుంబంపై జరిగిన దాడిపై స్పందించాడు. ఇది చాలా దారుణమని, తన మామాను దుండగులు అతి కిరాతకంగా చంపారని రైనా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను వదిలిపెట్టవద్దని పంజాబ్ పోలీసులను కోరాడు.

దుండగులను వదలవద్దు..

దుండగులను వదలవద్దు..

‘పంజాబ్‌లో మా బంధవులపై జరిగింది చాలా దారుణం. మా మామ‌ను అత్యంత దారుణంగా హత్య చేశారు. దుండగుల దాడిలో మా అత్త, ఇద్దరు కజీన్స్ తీవ్రంగా గాయపడ్డారు. దురదృష్టవశాత్తు చికిత్సపొందుతూ మా కజిన్ గత రాత్రి ప్రాణాలు విడిచారు. మా అత్తమ్మ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. మృత్యువుతో పోరాడుతుంది. ఈ రోజుకి ఆరాత్రి ఏం జరిగిందనేదానిపై స్పష్టత లేదు. ఎవరు చేశారనేది తెలియడం లేదు. పంజాబ్ పోలీసులను నేను కోరేది ఒక్కటే.. దుండగులను వదిలిపెట్టవద్దు. వారిని పట్టుకునే మార్గాలున్నాయి. ఇలాంటి దారుణాలు మళ్లీ చేయకుండా వారిని కఠినంగా శిక్షించాలి' అని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్‌కు ట్యాగ్ చేస్తూ రైనా వరుస ట్వీట్లు చేశాడు.

దోపిడీ దొంగల చేతిలో..

దోపిడీ దొంగల చేతిలో..

రైనా మామ (మేనత్త భర్త)‌ అశోక్‌ కుమార్‌ దారుణ హత్యకు గురైనట్లు శనివారం పంజాబ్ పోలీసులు మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే. దోపిడీ దొంగల దాడిలో అశోక్‌ ప్రాణాలు కోల్పోగా నలుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారన్నారు . పంజాబ్ పఠాన్‌కోఠ్ జిల్లాలో ప్రభుత్వ కాంట్రాక్టర్ అయిన అశోక్ కుమార్(58) తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నారు. ఈ నెల 19న రాత్రి వీరు డాబాపై నిద్రిస్తుండగా...గుర్తు తెలియని దుండగులు వీరి ఇంట్లోకి ప్రవేశించి దోపిడికి ప్రయత్నించారు.

తిరగడబడటంతో..

తిరగడబడటంతో..

అయితే వారిపై అశోక్‌తో పాటు కుటుంబ సభ్యులు తిరగబడటంతో బలమైన ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. కొంత నగదు, బంగారం దోచుకెళ్లారు. దోపిడీ దొంగల దాడిలో అశోక్ కుమార్ తలకు తీవ్ర గాయాలుకాగా...అదే రాత్రి కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు. అశోక్ కుమార్ తల్లి సత్యదేవి, భార్య ఆశాదేవి, కుమారులు అపిన్, కౌశల్ కూడా గాయపడ్డారు. సత్యదేవి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా..మిగిలిన ముగ్గురిలో ఒకరు సోమవారం రాత్రి ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ గుల్నీత్ సింగ్ తెలిపారు.

హోటల్ గది విషయంలో..

హోటల్ గది విషయంలో..

అయితే దుబాయ్‌లో తనకు కేటాయించిన హోటల్‌ గది పట్ల రైనాలో కలిగిన అసంతృప్తే చివరకు ఐపీఎల్‌ను వీడేలా చేసిందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో చెన్నై జట్టు యజమాని ఎన్ శ్రీనివాసన్ రైనా నిష్క్రమణపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. దుబాయ్‌లో రైనాకు కేటాయించిన గద అతనికి నచ్చలేదని, సరైన బాల్కనీ కూడా లేదని అతను జట్టు మేనేజ్‌మెంట్‌లో అన్నట్లు పుకార్లు వినిపించాయి. ఈ విషయంలో జట్టు పెద్దలు ఏం చేయకపోవడంతో ‘వ్యక్తిగత కారణాలు' అంటూ స్వదేశం బయల్దేరిపోయాడని ప్రచారం జరిగింది. కానీ రైనా తాజా ట్వీట్‌ను చూస్తే.. అతని కుటుంబం దారుణ హత్యకు గురవడంతోనే భారత్‌కు వచ్చినట్లు స్పష్టం అవుతుంది.

Story first published: Tuesday, September 1, 2020, 12:49 [IST]
Other articles published on Sep 1, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+