తండ్రికి తగ్గ తనయుడు.. నా కొడుకు మొదలెట్టాడు: సురేష్ రైనా
భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా కుమారుడు రియో రైనా తన క్రికెట్ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని సురేష్ రైనానే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ప్యాడ్స్, గ్లౌవ్స్, హెల్మెట్‌తో ఉన్న తన కొడుకు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకొని మురిసిపోయాడు. అంతేకాకుండా బ్యాట్ల కంపెనీలో రియో రైనా తనకు కావాల్సిన బ్యాట్ ఎంచుకుంటున్న వీడియోను కూడా ఈ పోస్ట్‌కు జత చేశాడు.
ఈ పోస్ట్‌కు సురేష్ రైనా అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చాడు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. 'తండ్రికి తగ్గ తనయుడు! ఇలా మన క్రికెట్ ప్రయాణం మొదలైంది. నాన్నా .. ఆటలోని ఆనందాన్ని, ఉత్సాహాన్ని, అమాయకత్వాన్ని మళ్ళీ ఒకసారి నీ కళ్ళ ద్వారా చూడటానికి నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఇద్దరం కలిసి కొన్ని అందమైన జ్ఞాపకాలను నిర్మించుకుందాం.'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

భారత బెస్ట్ ఫీల్డర్‌గా..
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కాగా.. సురేష్ రైనా కొడుకుకు నెటిజన్లు ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు. తండ్రికి మించిన తనయుడిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా సీఎస్‌కే ఫ్యాన్స్.. 6 ఏళ్ల రియో రైనా భవిష్యత్తు టీమిండియా స్టార్ కావాలని ఆకాంక్షిస్తున్నారు.
టీమిండియా మిడిలార్డ్ బ్యాటర్‌గా, గొప్ప ఫీల్డర్‌గా సురేష్ రైనా గుర్తింపు పొందాడు. 2005 నుంచి 2018 వరకు భారత జట్టుకు ఆడిన సురేష్ రైనా.. 322 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2020 ఆగస్ట్ 15న మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే సురేష్ రైనా కూడా వీడ్కోలు పలికాడు. భారత్ తరఫున 18 టెస్ట్‌లు, 226 వన్డేలు, 78 టీ20 ఆటాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ బాదిన తొలి భారత ఆటగాడిగా సురేష్ రైనా చరిత్రకెక్కాడు.
చిన్న తల..
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సుదీర్ఘ కాలం ఆడిన రైనా.. చిన్న తలగా అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. 205 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 5528 పరుగులు చేశాడు. సుదీర్ఘ కాలం భారత జట్టుకు ఆడిన రైనా.. ఇప్పుడు తన కుమారుడిని కూడా క్రికెటర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అందరి క్రికెటర్ల కొడుకులా కాకుండా రియో రైనా స్టార్ ప్లేయర్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

