టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. అమెరికా వేదికగా జరుగుతున్న నేషనల్ క్రికెట్ లీగ్‌లో న్యూయార్క్ లయన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సురేశ్ రైనా.. లాస్ ఏంజెల్స్ వేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. లాస్ ఏంజెల్స్ కెప్టెన్, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను సురేశ్ రైనా చెడుగుడు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా.. భారీ షాట్లు ఆడే సత్తా తనలో ఇంకా ఉందని రైనా చాటి చెప్పాడు.
షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో సురేశ్ రైనా రెండు భారీ సిక్స్‌లతో పాటు ఒక ఫోర్ కొట్టి 18 పరుగులు పిండుకున్నాడు. సురేశ్ రైనా భారీ షాట్లతో విరుచుకుపడటంతో షకీబ్ అల్ హసన్ మళ్లీ బౌలింగ్ చేయలేదు. ఇక రైనా విధ్వంసకర బ్యాటింగ్‌కు అతని ఫ్యాన్స్, సీఎస్‌కే అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

దూకుడైన బ్యాటింగ్‌తో సురేశ్ రైనా 28 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్స్‌లతో 4 ఫోర్లు ఉన్నాయి. దాంతో లయన్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 126 పరుగులు చేసింది. ఈ టోర్నీ 60 బాల్ ఫార్మాట్‌లో జరుగుతోంది. సురేశ్ రైనాకు అండగా.. శ్రీలంక బ్యాటర్ ఉపుల్ తరంగా(23 బంతుల్లో 40) రాణించాడు.
అనంతరం వేవ్స్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు 107 పరుగులే చేసి ఓటమిపాలైంది. టీమ్ డేవిడ్ పోరాడినా ఫలితం లేకపోయింది. షకీబ్ అల్ హసన్(13) కూడా విఫలమయ్యాడు.
Suresh Raina makes a roaring entry on the NCL stage with a stroke-filled half-century that lifted New York Lions to 126. 🔥#NCLonFanCode pic.twitter.com/4IS8waiIdF
— FanCode (@FanCode) October 5, 2024