For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రవీంద్ర జడేజా లాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారు: సురేశ్ రైనా

Suresh Raina Says Someone like Ravindra Jadeja has to be in all three formats
IPL 2021 : Ravindra Jadeja నెంబర్ 1 All-rounder - Suresh Raina | Csk vs Srh || Oneindia Telugu

ఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై తన సహచర ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా ప్రశంసల జల్లు కురిపించాడు. జడేజా లాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారన్నాడు. మైదానంలో ఏ క్షణంలోనైనా మ్యాచ్ మలుపు తిప్పే సామర్థ్యం అతనికి ఉందని కొనియాడాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జరిగిన మ్యాచ్‌లో జడేజా బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్మురేపి చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయాన్నందించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్‌లో 5 సిక్సర్లతో 37 రన్స్ పిండుకొని అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో సీఎస్‌కే మీడియా టీమ్‌లో మాట్లాడిన రైనా.. జడ్డూను ప్రత్యేకంగా అభినందించాడు.

 నెంబర్ వన్ ఆల్‌రౌండర్..

నెంబర్ వన్ ఆల్‌రౌండర్..

'జడేజా బౌలింగ్‌తో పాటు అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. ఇక ఫీల్డింగ్‌లో అతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఏడో, ఎనిమిదో క్యాచ్‌లు పట్టాడనుకుంటా. జడేజాలా మూడు ఫార్మాట్లలో రాణించే ఆల్‌రౌండర్లు చాలా అరుదుగా ఉంటారు. అతను మంచి హార్డ్‌వర్కర్‌.. నా దృష్టిలో ఇప్పుడు నెంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌. ఆటలో ఎంత మంచి ప్రదర్శన చేసినా అతి చేయకుండా పద్దతిగా ఉంటాడు. జడేజాలో నాకు నచ్చిన గుణం అదే. ఇక ఫీల్డింగ్‌లో అతను పెట్టే శ్రమ నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఫీల్డింగ్‌ను బాగా ఆస్వాదిస్తాడు.

ఏ క్షణంలోనైనా మలుపు తిప్పగలడు..

ఏ క్షణంలోనైనా మలుపు తిప్పగలడు..

మైదానంలో మెరుపువేగంతో కదిలే అతను క్షణాల్లో మ్యాచ్‌ను మలుపుతిప్ప గల సమర్థుడు. మ్యాచ్‌ మనకు అనుకూలంగా లేదన్న సమయంలో ఒక మెరుపు క్యాచ్‌ లేదా రనౌట్‌తో ఆటను మార్చేస్తాడు. అందుకే అతనితో కలిసి పనిచేయడం నాకు ఎప్పుడు సంతోషాన్నిస్తుంది. ఏ కెప్టెన్ అయినా అతని లాంటి ఆటగాడు జట్టులో ఉండాలనుకుంటారు.'అని రైనా చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను సీఎస్‌కే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

2011 నుంచి..

ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న జడేజా ఐపీఎల్‌ 2021 సీజన్‌లోనూ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ ఆల్‌రౌండ్‌ షో కనబరిచాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లోనూ అన్నింటా తానే ముందుండి జట్టును గెలిపించాడు. మొదట బ్యాటింగ్‌లో 62 పరుగులతో విధ్వంసం.. బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు.. ఫీల్డింగ్‌లో మెరుపు రనౌట్‌.. వెరసి ఒక ఆల్‌రౌండర్‌ అంటే ఎలా ఉంటాడో చూపించాడు. టీమిండియా తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన రైనా, జడేజాలు ఐపీఎల్‌లోనూ 2011 నుంచి కలిసి ఆడుతున్నారు. 2011 నుంచి సీఎస్‌కేకు ఆడుతున్న వీరిద్దరు.. 2016లో సీఎస్‌కే బ్యాన్‌కు గురవడంతో రెండేళ్ల పాటు గుజరాత్‌ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించారు.

Story first published: Wednesday, April 28, 2021, 20:42 [IST]
Other articles published on Apr 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+