For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025 టైటిల్ ఆ జట్టుదే: సురేశ్ రైనా

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలుస్తుందని సురేశ్ రైనా జోస్యం చెప్పాడు. ఈ ఏడాది ఆర్‌సీబీ మెరుగైన ప్రదర్శన చేస్తుందని తెలిపాడు. ముఖ్యంగా ఆ జట్టు బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తుందని కొనియాడాడు. ఐపీఎల్ 2025 బ్రేక్ ఆర్‌సీబీ మూమెంటమ్‌ను దెబ్బతీయలేదన్నాడు. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా వారం పాటు వాయిదా పడిన ఐపీఎల్ 2025 సీజన్ మరికొద్ది గంటల్లో తిరిగి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

బెంగళూరు వేదికగా కేకేఆర్, ఆర్‌సీబీ మధ్య నేడు(శనివారం)జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 సీజన్ రీస్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ షోలో మాట్లాడిన సురేశ్ రైనా.. ఆర్‌సీబీకి టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. ఐపీఎల్ బ్రేక్ ఆర్‌సీబీ జైత్రయాత్రను అడ్డుకోలేదని అభిప్రాయపడ్డాడు.

Suresh Raina Says RCB will Win IPL 2025

'ఈ సారి ఆర్‌సీబీకి టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్‌సీబీ ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతోంది. చిన్నస్వామి మైదానంలో 150, 136 పరుగుల స్వల్ప లక్ష్యాలను కాపాడుకుంటుంది. ముఖ్యంగా వారి బౌలింగ్ విభాగం జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. కొత్త కెప్టెన్ రజత్ పటీదార్ ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్‌ను రెండు సార్లు ఓడించాడు. చెన్నై గడ్డపై గెలవడంతో పాటు సొంతగడ్డపై సీఎస్‌కేను ఆర్‌సీబీ ఓడించింది. ఈ ఫలితాలనే ఆర్‌సీబీ బలాన్ని తెలియజేస్తున్నాయి. వారి డ్రెస్సింగ్ రూమ్ కూడా చాలా సానుకూలంగా ఉంది. ఇవే ఆ జట్టు టైటిల్‌కు చేరువైందనే సంకేతాలు ఇస్తున్నాయి. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ కూడా అదరగొడుతున్నాయి. కానీ ఈ ఏడాది విరాట్ కోహ్లీ 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరపడొచ్చు.'అని సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.

ఆరెంజ్ క్యాప్ జాబితాలో ఆటగాళ్ల మధ్య 10 పరుగుల వ్యత్యాసమే ఉందని, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడని రైనా కొనియాడాడు. 'ఆరెంజ్ క్యాప్ జాబితాలోని ఆటగాళ్ల మధ్య 2, 8, 10 పరుగుల వ్యత్యాసం మాత్రమే ఉంది. సూర్యకుమార్ యాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. అతను ఓపెనర్‌ కాకున్నా.. లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ జాబితాలో పోటీ పడుతున్నాడు. సూర్యను మూడో స్థానంలో ఆడించడం మొదలు పెట్టినప్పటి నుంచి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విభాగం బలంగా మారింది. నెంబర్ 3 బ్యాటర్‌ మ్యాచ్‌లను ముగిస్తే.. ఆరెంజ్ క్యాప్ కాదు.. టైటిల్ కూడా దక్కుతుంది.'అని సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, May 17, 2025, 15:29 [IST]
Other articles published on May 17, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+