Suresh Raina: ధోనీ బాటలోనే నేను.. అతను ఐపీఎల్ 2022 ఆడకుంటే నేను ఆడను!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ ఐపీఎల్ ఆడకుంటే తాను కూడా ఆడనని తెగేసి చెప్పాడు. ఒకవేళ తమ జట్టు ఐపీఎల్ 2021 సీజన్ గెలిస్తే.. తదుపరి సీజన్ ఆడేలా ధోనీని ఒప్పిస్తానన్నాడు. క్రికెటర్‌గా చివరి క్షణం వరకు సీఎస్‌కే టీమ్‌కే ఆడాలనుకుంటున్నానని, అవకాశం దక్కకుంటే మరో టీమ్ తరఫున బరిలోకి దిగే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత కారణాలతో గత ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్న సురేశ్ రైనా.. భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 సీజన్‌తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. తనదైన బ్యాటింగ్‌తో సత్తా చాటాడు.

సీఎస్‌కేతోనే ఉంటా..
ఇక బుధవారంతో 40వ వసంతంలోకి అడుగుపెట్టిన ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని అనుకుంటున్న తరుణంలో రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూస్ 24 స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడుతూ.. 'నాకింకా మరో నాలుగు, ఐదేళ్లు ఆడే అవకాశం ఉంది. ఈ సీజన్ ఐపీఎల్ కూడా మేం ఆడాల్సి ఉంది. వచ్చే ఏడాది మరో రెండు జట్లు కొత్తగా రాబోతున్నాయి. కానీ క్రికెటర్‌గా చివరి క్షణం వరకు నేను సీఎస్‌కేతోనే ఉండాలనుకుంటున్నా. ఈ ఏడాది మేం అద్భుతంగా రాణిస్తామని ఆశిస్తున్నా.

ధోనీ ఆడకుంటే..
ధోనీ భాయ్ వచ్చే ఏడాది ఆడకుంటే.. నేను కూడా తప్పుకుంటా. మేమిద్దరం కలిసి 2008 నుంచి సీఎస్‌కేకు ఆడుతున్నాం. ఒక వేళ మేం ఈ ఏడాది టైటిల్ గెలిస్తే వచ్చే సీజన్ ఆడేలా ధోనీ భాయ్‌ని ఒప్పిస్తా. నా సాయశక్తుల మేర నేను ప్రయత్నిస్తా. ఒకవేళ అతను ఆడకుంటే మాత్రం నేను కూడా ఏ ఐపిఎల్ జట్టుకైనా ఆడతానని అనుకోను.' అని రైనా చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ అరంగేట్ర సీజన్ నుంచి ధోనీ, రైనా చెన్నైకి ఆడుతున్నారు. ఈ ఇద్దరు ఆ జట్టుకు రెండు పిల్లర్స్ లాంటి వారు. ఎన్నో చిరస్మరణీయ విజయాలందించారు.

‘నీ దారిలోనే నడుస్తా’..
గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు ధోనీ, సురేశ్ రైనా క్రికెట్ అభిమానులకు ఊహించని షాకిచ్చారు. అనూహ్యంగా ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగా.. క్షణాల వ్యవధిలో 'నీ దారిలోనే నడుస్తా' అంటూ సురేశ్ రైనా వీడ్కోలు పలికాడు. 'కెరీర్ అసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని ఓ వీడియోను ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా... ధోనీతో ఆడటం తనకెంతో సంతోషంగా ఉందని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చెప్పిన సురేష్ రైనా ధోనీ ప్రయాణంలో తాను కూడా తోడుగా ఉండదలచుకున్నానని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

నా గైడ్ నువ్వే..
బుధవారం 40వ పుట్టిన రోజు జరుపుకున్న ధోనీకి రైనా తనదైన శైలిలో ఓ వీడియో ద్వారా విషెస్ చెప్పాడు. 'ఎంఎస్ ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు నాకు మిత్రుడు, సోదరుడు, మార్గనిర్దేశకుడు. మీ నుంచి అందరూ కోరుకునేది ఇదే. మీ ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. ఒక గొప్ప ఆటగాడిగా, నాయకుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు' అని సురేశ్ రైనా ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications