ధోనీ చెప్పిన ఆ ఒక్క మాటతో కెప్టెన్సీ ఆఫర్లన్నీ వదులుకున్నా: సురేశ్ రైనా
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మాజీ బ్యాటర్ సురేశ్ రైనా మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామాయణంలో శ్రీరాముడికి హనమంతుడికి ఉన్న బంధం.. మహాభారతంలో కృష్ణా-అర్జున మధ్య ఉన్న రిలేషన్ కంటే గొప్పదని వారి ఫ్యాన్స్ కామెంట్ చేస్తుంటారు.
టీమిండియా కెప్టెన్‌గా, చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా సురేశ్ రైనాకు ధోనీ అండగా నిలిచాడు. సురేశ్ రైనా కూడా ధోనీ మాట కాదనలేదు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన తొలి మూడు టైటిళ్లలో సురేశ్ రైనా కీలక పాత్ర పోషించాడు. ధోనీ తర్వాత చిన్న తాలాగా చెన్నై ఫ్యాన్స్ అభిమానాన్ని అందుకున్నాడు.

2021 వరకూ ధోనీ తర్వాత జట్టులో వైస్ కెప్టెన్‌గా కొనసాగాడు. 2022లో మొదటిసారి సురేష్ రైనాను వేలానికి వదిలేసిన చెన్నై సూపర్ కింగ్స్, తిరిగి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. ఆకాశ్ చోప్రా హోస్ట్ చేస్తున్న 'హోమ్ ఆఫ్ హీరోస్' ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సురేష్ రైనా.. ధోనీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
ఐపీఎల్‌లో తనకు చాలా జట్లు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చాయని, ధోనీ చెప్పిన మాటతో వాటన్నింటినీ వదులుకున్నానని తెలిపాడు. 'దేశవాళీ క్రికెట్‌లో నేను ఉత్తరప్రదేశ్ జట్టుకు సారథిగా వ్యవహరించా. ధోనీ గైర్హాజరీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కూడా నడిపించా. చెన్నై టీమ్ సస్పెన్షన్‌కు గురైనప్పుడు గుజరాత్ లయన్స్ జట్టుకు సారథిగా వ్యవహరించా.
దాంతో ఐపీఎల్‌లో చాలా టీమ్స్ కెప్టెన్సీ ఆఫర్స్ ఇచ్చాయి. అయితే ధోనీ భాయ్ మాత్రం నన్ను జట్టును విడిచి పోవద్దని చెప్పాడు. తాను చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా ఉన్నంత కాలం.. నువ్వే వైస్ కెప్టెన్‌గా ఉంటావని హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే నేను జట్టులో ఉన్నన్నీ రోజులు ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు. అందుకే ఇతర జట్లు ఇచ్చిన ఆఫర్స్‌ను వదులుకున్నా.
కెప్టెన్ అవ్వాలని ఏనాడు ఆశపడలేదు. నేనెప్పుడూ జట్టు ప్లేయర్‌గానే ఉన్నాను. నా టీమ్ సహచర ఆటగాళ్లకు అవసరమైన సాయం చేయడం.. వారి సమస్యలను అర్థం చేసుకోవడం, వాటిని పరిష్కరించేందుకు ఏం చేయాలో ఆలోచించడం మాత్రమే నాకు తెలుసు. పదవులు కోరుకోలేదు. ఇక నేను ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ మహేంద్ర సింగ్ ధోనీనే.

నేను నెట్స్‌లో ముత్తయ్య మురళీధరన్, హర్భజన్ సింగ్, మొయిన్ ఆలీ, ఇమ్రాన్ తాహీర్ వంటి దిగ్గజ స్పిన్నర్లను ఎదుర్కొన్నాను. అయితే నాకు ధోనీ బౌలింగ్ ఆడటమే చాలా కష్టంగా అనిపించింది. ధోనీ ఆఫ్ స్పిన్‌తో పాటు మీడియం పేస్ కూడా వేస్తాడు. స్పిన్ వేస్తాడు కదా అని ప్రిపేర్ అయితే మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు.
ఒకే పేస్ బౌలింగ్ కదా అని ఫిక్స్ అయితే లెగ్ స్పిన్‌తో పల్టీ కొట్టిస్తాడు. అతనికి అన్ని రకాల బౌలింగ్స్ తెలుసు.'అంటూ సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications