Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రియాంక.. నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా సాధిస్తా: సురేశ్ రైనా

Suresh Raina’s wife pens heartfelt note on her husband’s 15-year international career

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ సురేశ్‌ రైనా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి గురువారానికి సరిగ్గా 15 ఏళ్లు. 2005 జూలై 30న శ్రీలంకతో దంబల్లా వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌తో రైనా తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. అప్పటి నుంచి ఎన్నో పరుగులు సాధించాడు. మరెన్నో మైలురాళ్లు అందుకున్నాడు. తన అద్భుతమైన ఫీల్డింగ్‌ విన్యాసాలతో అబ్బురపరిచాడు. 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో రైనా సభ్యుడు. ఇక టీ20, టెస్ట్, వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్ కూడా రైనానే.

ఇప్పటి వరకు 226 వన్డేల్లో 5,616 పరుగులు చేసిన రైనా.. 78 టీ20లు, 18 టెస్టులు ఆడాడు. 2018 నుంచి టీమిండియాకు దూరమైన ఈ వెటరన్ బ్యాట్స్‌మన్ ప్రస్తుతం ఐపీఎల్‌ 2020 సీజన్ కోసం సిద్దమవుతున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో సత్తా చాటి భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు.

అక్షరాలతో అభినందన..

అక్షరాలతో అభినందన..

ఇక 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా భారత క్రికెటర్లతో పాటు అభిమానులు రైనాకు విషెస్ తెలియజేస్తున్నారు. ఇక రైనా సతీమణి ప్రియాంక అయితే సోషల్‌ మీడియా వేదికగా ఓ హర్ట్ టచింగ్ సందేశాన్ని షేర్ చేసింది. ఆటపై రైనాకు ఉన్న అంకిత భావం, ప్రేమ, కెరీర్‌లో నిలదొక్కుకొనేందుకు పడ్డ శ్రమను తన అక్షరాలతో వివరించారు.

నీ కష్టాన్ని నేనే చూశా..

నీ కష్టాన్ని నేనే చూశా..

‘నువ్వు తొలి వన్డే ఆడి పదిహేను సంవత్సరాలు గడిచింది! ఈ 15 ఏళ్లలో ఎన్నో విజయాలు అందుకున్నావు. ఎంతో కష్టపడ్డావు. మరెన్నో ఒడిదొడుకులూ ఎదుర్కొన్నావు. నీ అభిరుచి, నీ అంకితభావం, నీకు లభించిన ఫలితాల్ని ఈ ప్రపంచమంతా చూసింది. నీ శ్రమ, నీ పిచ్చి, నువ్వు నిద్రపోని రాత్రులు, కొన్నింటికి నువ్వు పడ్డ బాధను మాత్రమే నేనొక్కదాన్నే చూశాను. ఆట కోసం నువ్వెంత తపన పడ్డావో గమనించాను. తిరిగి నీ ఆటను నువ్వు అందుకొనేందుకు పడ్డ ఆవేదన, శ్రమ, నీకు అండగా నిలిచిన వారిని నేను చూశాను.

విమర్శలకు బదులిచ్చిన తీరు..

ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానాన్ని నువ్వు ఆశీర్వాదంగా భావించావు. వారి అంచనాలను అందుకొనేందుకు అత్యుత్తమంగా ఆడేందుకు నిరంతరం కృషి చేశావు. అయితే ప్రతిసారీ ఎవ్వరూ పరిపూర్ణంగా ఉండలేరు. నీ వంతుగా కృషి చేసేందుకు ఓపికపట్టావు. విమర్శలకు నువ్వు ప్రశాంతంగా బదులిచ్చిన తీరును నేను అభినందిస్తున్నా. నిన్ను చూసి నేనెప్పుడూ గర్వపడతాను. నువ్వెన్నో ఘనతలు సాధించావు. ఇంకెన్నో ఘనతలకు అర్హుడివి కూడా.

ఎప్పుడూ మనస్ఫూర్తిగా అభినందించే హృదయం నీది. నువ్వలాగే ఉండాలి. మరింత కష్టపడు. మరింత జ్వలించు. అపరిమితంగా కృషి చేయి. మిగతాదంతా నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. నిన్నెప్పుడూ మేం ప్రేమిస్తూనే ఉంటాం. నువ్వు సాధించిందానికి గర్వపడుతుంటాం. ప్రేమతో నీ రియో, గ్రేసియా, ప్రియాంక.'అని రైనా సుదీర్ఘ పోస్ట్‌లో రాసుకొచ్చింది.

నువ్వు పక్కన ఉంటే..

నువ్వు పక్కన ఉంటే..

తన సతీమణి హార్ట్ టచింగ్ మెసేజ్‌పై రైనా స్పందించాడు. ఆమె ప్రేమ, మద్దతుతోనే ఇదంతా సాధ్యమైందని తెలిపాడు.‘ఇదంతా నీ ప్రేమ, మద్దతు లేకుండా సాధ్యమయ్యేది కాదు. నా బలానికి నువ్వే పిల్లర్‌. నేను దేశానికి ఆడగలననే నమ్మకాన్ని, స్పూర్తిని రగిల్చింది నువ్వే. నువ్వు నా పక్కన ఉంటే నేనేదైనా సాధిస్తా. మన పిల్లలు, నీపై నాకు అపారమైన ప్రేమ ఉంది.'అని రైనా కామెంట్ చేశాడు.

Story first published: Friday, July 31, 2020, 14:26 [IST]
Other articles published on Jul 31, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+