CSK కెప్టెన్‌గా ధోనీ స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఆ నలుగురికి ఉంది: సురేశ్ రైనా


న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేసే సత్తా జట్టులోని నలుగురు ఆటగాళ్లకు ఉందని ఆ జట్టు మాజీ ప్లేయర్, టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్నాడు. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడులతో పాటు డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజాలు సీఎస్‌కే కెప్టెన్‌గా రాణించగలరని అభిప్రాయపడ్డాడు. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న రవీంద్ర జడేజాకు సీఎస్‌కే భవిష్యత్తు కెప్టెన్‌గా మంచి అవకాశాలున్నాయన్నాడు.
అయితే కెప్టెన్‌గా అతనికి పెద్దగా అనుభవం లేకపోవడం ప్రతికూలంశమని చెప్పాడు. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సురేశ్ రైనా ఏ జట్టు కోనుగోలు చేయని విషయం తెలిసిందే. దాంతో అతను అమ్ముడుపోని జాబితాలో చేరిపోయాడు.

కామెంటేటర్‌గా సెకండ్ ఇన్నింగ్స్..
దాంతో చేసేదేమి లేక స్టార్ స్పోర్ట్స్ హిందీ కామెంటేటర్‌గా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఈ సీజన్ నుంచే రవిశాస్త్రితో కలిసి ఐపీఎల్ మ్యాచ్‌లకు వ్యాఖ్యానం చేయనున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ స్పోర్ట్స్ వెబినార్‌లో మాట్లాడిన రైనా సీఎస్‌కే గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'సీఎస్‌కే భవిష్యత్తు కెప్టెన్‌లుగా అంబటి రాయుడు ఉన్నాడు.
అతనితో పాటు రాబిన్ ఊతప్ప, డ్వేన్ బ్రావోలు కూడా మంచి ఆప్షనే. జడేజాకు కూడా ఆ సత్తా ఉంది. ఇటీవల కాలంలో అద్భుతంగా రాణిస్తున్నాడు'అని రైన్ చెప్పుకొచ్చాడు. అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప, డ్వేన్ బ్రావోల కెరీర్‌లు చివరి దశలో ఉన్న నేపథ్యంలో వారికి సీఎస్‌కే సారథ్య బాధ్యతలు దక్కడం కష్టమే.

మంచు పాత్ర కీలకం..
ఐపీఎల్ 2022 సీజన్‌లో శుభారంభం అందుకోవడం చాలా ముఖ్యమని రైనా చెప్పుకొచ్చాడు. ముంబైలోని వాంఖడే, పుణే మైదానాల్లో విపరీతమైన మంచు కురుస్తుందని, అది ఫలితంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నాడు. 'ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు ఎలా క్వాలిఫై కావాలో సీఎస్‌కేకు బాగా తెలుసు. శుభారంభం అనేది చాలా ముఖ్యం. పుణేలో ఓపెన్ ఎన్విరాన్‌మెంట్ వల్ల అక్కడ ఎప్పుడు మంచు కురుస్తుందో అస్సలు అంచనా వేయలేం. వాంఖడేలో కూడా మంచు ప్రభావం ఉంటుంది.

తడి బంతితో ప్రాక్టీస్..
ఈ క్రమంలోనే ఇప్పటికే బౌలర్లు తడి బంతితో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించవచ్చు. టాస్ ఓడిపోయి రెండో సారి బౌలింగ్ చేయాల్సి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటనే సందేహం కలుగుతోంది. ముఖ్యంగా ధోనీ, హార్దిక్ పాండ్యా ఉన్నటు వంటి జట్లపై ఆందోళన రేకెత్తిస్తుంది. అయితే ఇవన్నీ ఆటలో సహజమే. టాస్‌ను మనం ఏం చేయలేం. 40 ఓవర్లను బాగా ఉపయోగించడంపై ఫోకస్ పెట్టాలి. అప్పుడే ఆశించిన ఫలితం దక్కుతుంది'అని రైనా చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications