న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫన్నీ: ఫీల్డ్ అంఫైర్‌ను వాటేసుకున్న సురేశ్ రైనా (వీడియో)

By Nageshwara Rao
Suresh Raina Hugs Paytm Umpire While Running IPL 2018 CSK Vs RR

హైదరాబాద్: జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లో రనౌటయ్యే ప్రమాదం నుంచి బయట పడిన రైనా.. వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఫీల్డ్ అంపైర్‌ను హత్తుకున్నాడు.

జయదేవ్ ఉనాద్కత్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన రైనా వేగంగా సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. బంతిని అందుకున్న రహానే వికెట్ల వైపు విసిరాడు. బంతి వికెట్లను తాకకపోవడంతో సురేశ్ రైనా రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. రనౌట్ నుంచి తప్పించుకోవడం కోసం వేగంగా పరిగెత్తుకొచ్చిన రైనా ఆ స్పీడ్‌ని అదుపు చేసుకోలేక ఎదురుగా ఉన్న అంపైర్ మారియస్ ఎరాస్మస్‌ను వాటేసుకున్నాడు.

1
43453

ఈ సంఘటనను చూసి అంపైర్‌తోపాటు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు సైతం కడుపుబ్బా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో బీసీసీఐ తన అధికారిక ఐపీఎల్ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో రైనా 35 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఆరు ఫోర్లు, ఒక సిక్స్ బాది ఇష్ సోధీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌తో రైనా ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచీ అన్ని సీజన్లలో 300కు పైగా పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా సురేశ్ రైనా రికార్డు సాధించాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌‌లో సురేశ్ రైనా ఈ ఘనత సాధించాడు. అంతేకాదు టీ20 క్రికెట్లో 150 క్యాచ్‌లు అందుకున్న తొలి భారత ఆటగాడిగానూ రైనా రికార్డు నెలకొల్పాడు.

Story first published: Saturday, May 12, 2018, 14:31 [IST]
Other articles published on May 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X