Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంపాక్ట్ రూల్ బౌలర్లకు శాపంగా మారింది.. ఆ లీగ్స్‌కు అనుమతివ్వొద్దు: సురేశ్ రైనా

ఇంపాక్ట్ ప్లేయర్‌ రూల్‌ను తొలగించాలని టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. ఈ రూల్‌ బౌలర్లకు శాపంగా మారిందని తెలిపాడు. భారత ఆటగాళ్లను బిగ్ బాష్, ది హండ్రెడ్ టోర్నీలకు అనుమతించవద్దని బీసీసీఐకి సూచించాడు.

గత కొంతకాలంగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌‌ను తొలగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు కూడా ఈ రూల్‌ను తప్పుబట్టారు. ఈ రూల్ కారణంగా ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యత లేకుండా పోతుందని, బౌలర్లకు శాపంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ రూల్‌ను కొనసాగించాలా? వద్దా అనే విషయంపై బీసీసీఐ దృష్టిసారించింది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీల అభిప్రాయాలను కోరింది.

IPL 2027: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్.. బీసీసీఐ కీలక నిర్ణయం!

IPL 2027: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్.. బీసీసీఐ కీలక నిర్ణయం!

ఇంపాక్ట్ ప్లేయర్‌కు నేను వ్యతిరేకం..

తాజాగా ఈ రూల్‌ గురించి మాట్లాడిన సురేశ్ రైనా తొలగించడమే ఉత్తమమని చెప్పాడు. ఈ రూల్ కారణంగా ఫిట్‌గా ఉన్న ప్లేయర్లు బ్యాటింగ్ చేసేసి బెంచ్‌కే పరిమితమవుతున్నారని తెలిపాడు. 'ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు నేను వ్యతిరేకం. ఎందుకంటే ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు కూడా ఈ రూల్ కారణంగా బ్యాటింగ్ చేసేసి బెంచ్‌కు పరిమితమవుతున్నారు. ఇలా చేస్తే వారిలో నైపుణ్యాలు ఎలా మెరుగవుతాయి.

Suresh Raina Hits Out at Impact Player Rule Says Fit Players Just Bat and Sit

ప్రపంచకప్‌లోనూ ఇలాంటి నిబంధన లేదు. అభిమానులను అలరించడానికే ఈ రూల్ తీసుకొచ్చారనే విషయం అర్థం అవుతుంది. కానీ, ఈ రూల్‌తో బౌలర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. వారికి ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. గతంలో 170 పరుగులు అంటేనే మంచి స్కోర్. ఇప్పుడు 250 పరుగులు చేసినా గెలిచే పరిస్థితి లేదు. 300 పరుగులు కూడా చేసే పరిస్థితులు ఉన్నాయి. బౌలర్లకు ఇది పీడకలగా మారుతోంది. వికెట్ తీయడానికి ఆప్షన్లే ఉండటం లేదు. ఇంపాక్ట్ రూల్ కారణంగా అదనపు బ్యాటర్‌ ఆప్షన్ లభిస్తుండటంతో బ్యాటర్లు దూకుడుగా ఆడి బౌలర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. 'అని సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.

IND vs AFG: ఆ ఇద్దరూ ఏం తప్పు చేశారు.. ఎందుకు తప్పించారు: మాజీ క్రికెటర్

Also Read

IND vs AFG: ఆ ఇద్దరూ ఏం తప్పు చేశారు.. ఎందుకు తప్పించారు: మాజీ క్రికెటర్

ఆ అవసరం భారత్‌కు లేదు..

విదేశీ లీగ్స్ ఆడాల్సిన అసవరం భారత్ ఆటగాళ్లకు లేదని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. 'భారత ఆటగాళ్లను బిగ్ బాష్, ది హండ్రెడ్ లీగ్‌లకు అనుమతించ వద్దు. ఐపీఎల్ చాలా పెద్ద లీగ్. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లినప్పుడు నేను కూడా అక్కడి లీగ్‌ల్లో ఆడేందుకు ఆసక్తి కనబర్చాను. కానీ ఇప్పుడు మన ఐపీఎల్‌లోనే ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు పోటీపడుతున్నారు. అలాంటప్పుడు మనం ఆ లీగ్‌ల్లో ఆడాల్సిన అవసరం లేదు.'అని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు.

Story first published: Saturday, September 5, 2026, 13:02 [IST]
Other articles published on Sep 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+