
ఫైనల్ చేరడం కూడా ఘనతే..
అంతేకాకుండా ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ కెప్టెన్‌గా కోహ్లీ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు. దాంతో కోహ్లీ కెప్టెన్‌గా పనికిరాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ ముందు విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా తప్పించి రోహిత్ శర్మకు జట్టు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. అయితే ఈ విమర్శలను రైనా తప్పుబట్టాడు. న్యూస్ 24 స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఫైనల్ చేరడం కూడా ఆశమాషీ వ్యవహారం కాదని, అది కూడా గొప్ప ఘనతేనని రైనా విమర్శకులకు చురకలంటించాడు.

కొంత టైమ్ ఇవ్వాలి...
'విరాట్ కోహ్లీ నెంబర్ వన్ కెప్టెన్. చాలా సాధించాడనే విషయాన్ని అతని ఘనతలే స్పష్టం చేస్తాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్. అందరూ ఐసీసీ ట్రోఫీల గురించి మాట్లాడుతున్నారు. కానీ అతను ఇంకా ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేదు. అతనికి కొంత టైమ్ ఇవ్వాలనేది నా అభిప్రాయం. వరుసగా 2-3 ప్రపంచకప్‌లు జరుగనున్నాయి. రెండు టీ20 ప్రపంచకప్‌తో పాటు ఓ వన్డే వరల్డ్ కప్ జరగనుంది. మెగా ఈవెంట్స్‌లో ఫైనల్ చేరడం అంత సులువైన పనికాదు. కొన్నిసార్లు ఫలితం ప్రతికూలంగా రావచ్చు. ఫైనల్ చేరడం కూడా గొప్పే'అని రైనా అభిప్రాయపడ్డాడు.

చోకర్స్ కాదు..
డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి అనంతరం భారత్ జట్టును ట్రోల్ చేసిన విధానాన్ని రైనా తప్పుబట్టాడు. ఇప్పటికే భారత జట్టు మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిందనే విషయాన్ని గుర్తు చేశాడు. 'టీమిండియా బలహీనమైన జట్టు కాదు. ఎందుకంటే ఇప్పటికే భారత్ 1983 ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచింది. మెగా టోర్నీల కోసం ఆటగాళ్లు ఎంతో శ్రమిస్తారనే విషయం అర్థం చేసుకోవాలి. మూడు ప్రపంచప్‌లు గెలిచిన జట్టును చోకర్స్ అంటారని నేను అనుకోను'అని రైనా చెప్పుకొచ్చాడు.

ధోనీ ఆడకుంటే..
భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ ఐపీఎల్ ఆడకుంటే తాను కూడా ఆడనని రైనా ఇదే ఇంటర్వ్యూలో తెగేసి చెప్పాడు. 'ధోనీ భాయ్ వచ్చే ఏడాది ఆడకుంటే.. నేను కూడా తప్పుకుంటా. మేమిద్దరం కలిసి 2008 నుంచి సీఎస్‌కేకు ఆడుతున్నాం. ఒక వేళ మేం ఈ ఏడాది టైటిల్ గెలిస్తే వచ్చే సీజన్ ఆడేలా ధోనీ భాయ్‌ని ఒప్పిస్తా. నా సాయశక్తుల మేర నేను ప్రయత్నిస్తా. ఒకవేళ అతను ఆడకుంటే మాత్రం నేను కూడా ఏ ఐపీఎల్ జట్టుకైనా ఆడతానని అనుకోను.' అని రైనా చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
