Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్లాష్ న్యూస్: ముంబైలో సురేష్ రైనా అరెస్ట్.. సింగర్‌ గురు రంధవ కూడా!!

Suresh Raina arrested in raid at Mumbai club

ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్ అయ్యాడు. ముంబై విమానాశ్రయానికి సమీపంలో ఉన్న డ్రాగన్‌ఫ్లై క్లబ్‌లో జరిగిన దాడిలో రైనాను సోమవారం రాత్రి అక్కడి స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రైనాపై కేసు నమోదు చేశారు. రైనాతో పాటు గాయకుడు గురు రంధవను కూడా ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇద్దరినీ బెయిల్‌పై విడుదల చేశారు. ఈ దాడిలో ముంబై క్లబ్‌కు చెందిన ఏడుగురు సిబ్బందిని అరెస్టు చేశారు.

రైనా అరెస్టు

రైనా అరెస్టు

ముంబై విమానాశ్రయం సమీపంలోని డ్రాగన్‌ఫ్లై క్లబ్‌లో సింగర్‌ గురు రంధవతో పాటు క్రికెటర్ సురేష్ రైనాను అరెస్టు చేశామని సహార్ పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. నిబంధనలకు విరుద్దంగా పబ్‌ నిర్వహించడంతో పాటు కరోనా వైరస్ నియమాలు పాటించకుండా వ్యవహరించినందుకు దాడులు చేశామన్నారు. దాడి సమయంలో రైనా, రంధవతో పాటు 34 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. స్టేషన్‌కు తరలించాక వారిని బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు చెప్పారు.

రైనా సహా 34 మంది

రైనా సహా 34 మంది

సోమవారం రాత్రి ముంబై క్లబ్‌లో జరిగిన దాడిలో బాలీవుడ్ ప్రముఖుడు సుస్సాన్ ఖాన్‌ కూడా అరెస్టు అయ్యాడు. సురేష్ రైనా సహా 34 మందిపై ఐపీసీ సెక్షన్ 188, 269, 34 కింద కేసు నమోదు చేశారని సమాచారం తెలుస్తోంది. కరోనా వైరస్ నిబంధనలు, ప్రొటోకాల్‌కు విరుద్ధంగా (ఎక్కువ సమయం) అక్కడ నిర్వహించిన మందు పార్టీలో పాల్గొన్నందుకు వారిపై కేసులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో వ్యాప్తి చెందుతున్న కొత్త కరోనా వైరస్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మహారాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూను ప్రకటించిన విషయం తెలిసిందే.

వ్యక్తిగత కారణాలతో

వ్యక్తిగత కారణాలతో

సురేష్ రైనా ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన అరగంటలోనే ఈ లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్‌ సైతం తన నిర్ణయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అనంతరం యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 2020లోనూ ఆడలేదు. తొలుత ఆడేందుకు యూఏఈ వెళ్లినా.. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు.

రెండో స్థానంలో

రెండో స్థానంలో

2008 నుంచీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న సురేష్ రైనా ఐపీఎల్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 5,878 పరుగులతో అగ్రస్థానంలో నిలవగా.. రైనా 5,368 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. రైనా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడబోతున్నాడు. దేశవాళీ టీ20 టోర్నీలో తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ తరఫున అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

బాక్సింగ్‌డే టెస్టు.. 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా ఎంపికైన ఆటగాడికి ప్రతిష్ఠాత్మక పతకం!!

Story first published: Tuesday, December 22, 2020, 13:28 [IST]
Other articles published on Dec 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+