న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీపై నమోదైన గృహ హింస కేసు విషయంలో దేశ అత్యున్నత న్యాయస్టానం సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై నెల రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుంప్రీకోర్టు ధర్మాసనం ఈ మేరకు పశ్చిమ్ బంగా సెషన్స్ కోర్టుకు గురువారం స్పష్టంచేసింది.
ఇక మహమ్మద్ షమీపై జారీచేసిన అరెస్టు వారెంట్‌ను నిలిపివేస్తూ సెషన్స్ న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ కలకత్తా హైకోర్టు ఈ ఏడాది మార్చి 29న వెలువరించిన ఆదేశాలను సవాల్ చేస్తూ అతని సతీమణి హసీన్ జహాన్ సుప్రీంను ఆశ్రయించింది.

ఈ అప్పీల్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. షమీపై నమోదైన కేసులో క్రిమినల్ రివిజన్ చేపట్టాలని ఆదేశించింది. నెల రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలని సెషన్స్ న్యాయమూర్తిని ఆదేశించింది. 2018లో షమీ, అతని కుటుంబ సభ్యుల్లో కొందరిపై హసీన్ జహాన్ గృహ హింస కేసు పెట్టిన విషయం తెలిసిందే.
గత ఐదేళ్లుగా మహమ్మద్ షమీకి దూరంగా ఉంటున్న హసీన్ జహాన్ అవకాశం దొరికినప్పుడల్లా అతనిపై సంచలన ఆరోపణలు చేస్తోంది. షమీ స్త్రీలోలుడని, ఆడది కనబడితే ఆగలేడని పేర్కొంది. చివరకు పడుపు వృత్తితో బతికే వేశ్యలతోనూ షమీ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని దేశ అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది.
నెలవారీ భరణంగా రూ.10 లక్షలు చెల్లించాలని కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. కోల్‌కతా కోర్టు మాత్రం.. ప్రతీ నెలా లక్షా 30 వేలు చెల్లిస్తే సరిపోతుందని ఆదేశించింది. అంతేకాకుండా షమీ అరెస్ట్‌పై కూడా స్టే విధించింది.
గతంలో వయసు విషయంలో షమీ తప్పుడు ధృవ పత్రాలు సమర్పించాడని, ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడని ఆరోపణలు గుప్పించగా.. బీసీసీఐ విచారణ జరిపి క్లీన్ ఛీట్ ఇచ్చింది. ఇన్నాళ్లు కాస్త సైలెంట్‌గా ఉన్న హసీన్ జహాన్ మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లి అతనిపై ఆరోపణలు గుప్పించింది.
మహమ్మద్ షమీ దగ్గర రెండో మొబైల్ ఫోన్ ఉండేదని, దాని ద్వారా అతను వివాహేతర సంబంధాలు కొనసాగించేవాడని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది.

వేశ్యలతో కూడా షమీకి సంబంధాలున్నాయని ఆరోపించింది. విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు కూడా షమీ లైంగిక అవసరాల కోసం అడ్డదారులు తొక్కుతాడని తెలిపింది. నాలుగేళ్లుగా షమీ తప్పించుకొని తిరుగుతున్నాడని, అతన్ని అరెస్ట్ చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.
ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న మహమ్మద్ షమీ.. వన్డే ప్రపంచకప్, ఆసియా కప్ కోసం సన్నదమవుతున్నాడు.