IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ కన్నేసిన నలుగు విదేశీ ఆటగాళ్లు వీరే!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 మెగావేలానికి సమయం దగ్గరపడుతున్నాకొద్ది సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్రణాళికలను వేగవంతం చేసింది. మెగా ఆక్షన్‌లో అనుసరించాల్సి వ్యూహాలను సిద్దం చేసుకుంటుంది. ఏయే ఆటగాడికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎలాంటి ఆటగాళ్లను టార్గెట్ చేయాలనే ప్లాన్స్‌ను రెడీ చేసుకుంటుంది. రిటెన్షన్ ప్రక్రియలో కేన్ విలియమ్సన్(రూ.14 కోట్లు), అబ్దుల్ సమద్(రూ.4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్(రూ.4 కోట్లు) ముగ్గురు ఆటగాళ్లనే తీసుకున్న సన్‌రైజర్స్ కేవలం రూ. 22 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఈ లెక్కన ఆరెంజ్ ఆర్మీ దగ్గర రూ. 68 కోట్లు ఉన్నాయి. అత్యధిక పర్స్ మనీ కలిగిన రెండో జట్టుగా సన్‌రైజర్స్ వేలంలో పాల్గొంటుంది.

డేవాన్ కాన్వే కోసం..
ఈ భారీ పర్స్ మనీతో సన్‌రైజర్స్ మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. అయితే గత కొన్ని సీజన్లుగా విదేశీ ఆటగాళ్లపై ఆధారపడ్డ సన్‌రైజర్స్ ఈసారి ఆ తప్పిదం చేయవద్దనుకుంటుంది. ఈ క్రమంలోనే నలుగురు ఖతర్నాక్ విదేశీ ఆటగాళ్లను టార్గెట్ చేసింది. ఓపెనింగ్ స్లాట్ కోసం మాజీ ప్లేయర్ జానీ బెయిర్ స్టోతో పాటు న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ డేవాన్ కాన్వేలను తీసుకోవాలనుకుంటుంది. ఈ ఇద్దరిలో ఒకరినైనా కొనుగోలు చేయాలని భావిస్తోంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ సూచనల మేరకు డేవాన్ కాన్వే కోసం సన్‌రైజర్స్ గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది.

బ్యాకప్‌గా పూరన్
ఇక మిడిలార్డర్‌లో కేన్ మామ ఉన్న నేపథ్యంలో అతనికి బ్యాకప్‌గా, వికెట్ కీపర్‌గా నికోలస్ పూరన్‌ను తీసుకోవాలనుకుంటుంది. డేవాన్ కాన్వే, బెయిర్ స్టో వేలంలో చిక్కకపోతే పూరన్ వైపు చూడనుంది. భారత స్టార్లకే తొలి ప్రాధానత్య ఇవ్వనున్నప్పటికీ తక్కువ ధరలో లభించే ఖతర్నాక్ విదేశీ ఆటగాళ్లను తీసుకోవాలనుకుంటుంది. గత రెండు సీజన్లుగా పూరన్ దారుణంగా విఫలమైనా.. తనదైన రోజున అతన్ని ఆపడం ఎవరికైనా కష్టమే.

జాసన్ హోల్డర్ కోసం..
ఆల్‌రౌండర్‌గా మాజీ ప్లేయర్ జాసన్ హోల్డర్‌పై కన్నేసిన ఆ జట్టు విండీస్‌కే చెందిన షేఫర్డ్ వంటి యువ పేస్ ఆల్‌రౌండర్లను కూడా తీసుకోవాలనుకుంటుంది. తొలి ప్రాధాన్యత మాత్రం హోల్డర్‌కే ఇవ్వనుంది. ఇక పేసర్లుగా ప్యాట్ కమిన్స్, ట్రెంట్ బౌల్ట్, కగిసో రబడాలను టార్గెట్ చేసింది. ఈ ముగ్గురిలో కనీసం ఒక్కరినైనా తీసుకోవాలనుకుంటుంది. గత సీజన్లలో దేశవాళీ పేసర్లతో మూల్యం చెల్లించుకున్న ఆ జట్టు ఈ సారైన టాప్ క్లాస్ బౌలర్‌ను ఎంచుకోవాలనుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications