న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనా కట్టడికి సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విరాళం

Sunrisers Hyderabad to donate Rs 10 crore towards coronavirus relief efforts
Sunrisers Hyderabad Donates 10 Crore, David Warner Appreciates

హైదరాబాద్‌: కరోనా కట్టడికి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందుకు వచ్చింది. తమవంతు సాయంగా రూ. 10 కోట్లను విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం తన అధికారిక ట్వీటర్‌ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది. కరోనాపై జరుగుతున్న పోరాటానికి తమ వంతు సాయంగా 10 కోట్ల రూపాయలను ఇవ్వనున్నట్లు తెలిపింది.

'కోవిడ్ -19 సహాయక చర్యల కోసం సన్ టీవీ గ్రూప్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) రూ .10 కోట్లు విరాళంగా ఇస్తోంది.'అని ట్వీట్ చేసింది. అయితే ఈ మొత్తాన్ని ఎవరికిస్తున్నామనే విషయాన్ని ఫ్రాంచైజీ స్పష్టం చేయలేదు. ఈ విరాళంపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ సైతం స్పందించాడు. సన్‌టీవీ గ్రూప్‌ మంచి పనికి నడుం బిగించడం హర్షణీయమని వార్నర్‌ ట్వీట్ చేశాడు. ఇక విపత్కర పరిస్థితుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన పెద్ద మనసు చాటుకుందని అభిమానులు కొనియాడుతున్నారు. మిగతా ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రోహిత్‌కు యూవీ క్విజ్.. తన హైట్ ఎంతో కూడా చెప్పలేకపోయిన హిట్‌మ్యాన్.!!రోహిత్‌కు యూవీ క్విజ్.. తన హైట్ ఎంతో కూడా చెప్పలేకపోయిన హిట్‌మ్యాన్.!!

ఇప్పటికే పలువురు క్రికెటర్లతో పాటు బీసీసీఐ ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌కు తమ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. యువరాజ్‌సింగ్‌ రూ. 50 లక్షలు, రోహిత్‌ శర్మ రూ. 80 లక్షలు, సచిన్‌ టెండూల్కర్‌ రూ. 50 లక్షలు, విరాట్‌ కోహ్లి దంపతులు రూ. 3 కోట్లు, బీసీసీఐ రూ. 51 కోట్లు, సౌరవ్ గంగూలీ 50 లక్షలు విరాళాన్ని అందజేశారు.

ఇక మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్.. కరోనా కారణంగా ఏప్రిల్ 15కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఈ క్యాష్ రిగ్ లీగ్ జరగం సందేహంగా మారింది.

Story first published: Thursday, April 9, 2020, 18:18 [IST]
Other articles published on Apr 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X