IPL 2026: ఆ నలుగురు ఆటగాళ్లకు SRH గుడ్‌బై!
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) దుమ్మురేపుతోంది. 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టైటిల్ గెలవడమే లక్ష్యంగా సాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఇతర జట్ల కంటే మెరుగ్గా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ 2016 విజయాన్ని రిపీట్ చేసేలా కనిపిస్తోంది.
ఈ సీజన్ ఆరంభంలో పేలవ బౌలింగ్‌తో కాస్త ఇబ్బంది పడిన ఆరెంజ్ ఆర్మీ యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆశించిన ఫలితం రాబట్టినా.. వచ్చే ఏడాదికి జట్టును మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. ఐపీఎల్ 2027 వేలానికి ముందు జట్టుకు అవసరం లేని ఆటగాళ్లను వదిలేయనుంది. ఈ జాబితాలో నలుగురు ఆటగాళ్లు ప్రధానంగా ఉండనున్నారు.

1. లియామ్ లివింగ్ స్టోన్
ఐపీఎల్ 2026 మినీవేలంలో రూ.13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన లియామ్ లివింగ్ స్టోన్ పూర్తిగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. 2 మ్యాచ్‌ల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశం దక్కినా.. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 15 పరుగులు మాత్రమే చేసి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మంచి ఓవర్‌సీస్ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేయాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది.
2. జయదేవ్ ఉనాద్కత్
ఐపీఎల్ 2025 మెగా వేలంలో కోటి రూపాయల కనీస ధరతో జట్టులోకి వచ్చిన జయదేవ్ ఉనాద్కత్ గత సీజన్‌లో 11 వికెట్లతో మెప్పించినా.. ఈ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్ ఆరంభంలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఉనాద్కత్ 10.91 ఎకానమీతో 4 వికెట్లు మాత్రమే తీసాడు.
ధారళంగా పరుగులివ్వడంతో సన్‌రైజర్స్ వరుస ఓటములను ఎదుర్కొంది. దాంతో అతన్ని పక్కనపెట్టి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వగా వారు సత్తా చాటారు. ఉనాద్కత్ పూర్తిగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో అతన్ని వదిలేసి మరో యువ పేసర్‌ను కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్ భావిస్తోంది.
3. హర్షల్ పటేల్
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.8 కోట్ల భారీ ధరతో జట్టులోకి వచ్చిన హర్షల్ పటేల్.. ఆ సీజన్‌లో 16 వికెట్లతో సత్తా చాటాడు. కానీ ఈ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. జయదేవ్ ఉనాద్కత్ తరహాలోనే ఈ సీజన్ ఆరంభంలో నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. అంతేకాకుండా 11.48 ఎకానమీతో ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
అతని స్థానంలో బరిలోకి దిగిన సాకిబ్ హుస్సేన్ అద్వితీయమైన ప్రద్శన కనబర్చడంతో హర్షల్ పటేల్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. వచ్చే సీజన్‌కు ముందు హర్షల్ పటేల్‌ను సన్‌రైజర్స్ వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
4. డేవిడ్ పేన్
ఆస్ట్రేలియా పేసర్ జాక్ ఎడ్వర్డ్స్‌కు ఇంజ్యూరీ రిప్లేస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చిన డేవిడ్ పేన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రెండు మ్యాచ్‌లే ఆడాడు. ఆర్‌సీబీతో తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన డేవిడ్ పేన్.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఒక వికెట్ తీయలేకపోయాడు. రెండు మ్యాచ్‌ల్లో 35 పరుగుల చొప్పున సమర్పించుకొని తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత కాలి మడమ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2027 రిలీజ్ లిస్ట్‌లో డేవిడ్ పేన్ పేరు ముందు వరుసలో ఉండనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

