ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు 20 మ్యాచ్‌లతో కూడిన తొలి దశ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించిన బీసీసీఐ.. గురువారం మిగిలిన 50 మ్యాచ్‌ల వివరాలను వెల్లడించింది. మార్చి 28 నుంచి మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు జరగనుండగా.. మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ సీజన్‌కు తెరపడనుంది. అయితే ప్లేఆఫ్స్ వేదికలను ఇంకా ఖరారు చేయలేదు.
సెకండాఫ్ షెడ్యూల్‌లో 12 వేదికల్లో మొత్తం 50 మ్యాచ్‌లు జరగనుండగా.. ఇందులో 8 డబుల్ హెడర్స్ ఉన్నాయి. డబుల్ హెడర్స్ ఉన్న రోజున మధ్యాహ్నం 3:30 గంటలకు ఒక మ్యాచ్, రాత్రి 7:30 గంటలకు రెండో మ్యాచ్ మొదలవుతుంది.

సెకండాఫ్ షెడ్యూల్‌లో తొలి మ్యాచ్ ఏప్రిల్ 13న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. మొత్తంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, న్యూ చండీగఢ్, రాయ్‌పూర్ వేదికల్లో ఐపీఎల్ 2026 మ్యాచ్‌లు జరగనున్నాయి. సెకండాఫ్ షెడ్యూల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం 10 మ్యాచ్‌లు ఆడనుంది. ఉప్పల్ వేదికగా మొత్తం ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఫస్టాఫ్:
మార్చి 28: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (బెంగళూరు, రాత్రి 7:30 గంటలకు)
ఏప్రిల్ 2: కోల్‌కతా నైట్‌రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (కోల్‌కతా, రాత్రి 7:30 గంటలకు)
ఏప్రిల్ 5: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్(హైదరాబాద్, మధ్యాహ్నం 3:30 గంటలకు)
ఏప్రిల్ 11: పంజాబ్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (ముల్లాన్‌పూర్, మధ్యాహ్నం 3:30 గంటలకు)
సెకండాఫ్:
ఏప్రిల్ 18: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్(హైదరాబాద్, రాత్రి 7:30 గంటలకు)
ఏప్రిల్ 21: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్(హైదరాబాద్, రాత్రి 7:30 గంటలకు)
ఏప్రిల్ 25: రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (జైపూర్, రాత్రి 7:30 గంటలకు)
ఏప్రిల్ 29: ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (ముంబై, రాత్రి 7:30 గంటలకు)
మే 3: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్‌రైడర్స్ (హైదరాబాద్, మధ్యాహ్నం 3:30 గంటలకు)
మే 6: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ (హైదరాబాద్, రాత్రి 7:30 గంటలకు)
మే 12: గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (అహ్మదాబాద్, రాత్రి 7:30 గంటలకు)
మే 18: చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (చెన్నై, రాత్రి 7:30 గంటలకు)
మే 22: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (హైదరాబాద్, రాత్రి 7:30 గంటలకు)
డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఐపీఎల్ 2016 టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. 2018, 2024లో ఫైనల్ చేరినా విజేతగా నిలవలేకపోయింది. ఈ సీజన్‌లోనైనా టైటిల్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.