IPL 2026: ఈ SRH బౌలర్.. ఒక్క సిక్సర్ కూడా ఇవ్వలేదు!
సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ సాకిబ్ హుస్సేన్ జట్టుకు వరంలా మారాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన సాకిబ్ హుస్సేన్ 72 బంతులు వేసి ఒక్క సిక్సర్ కూడా ఇవ్వలేదు. మొత్తం 6 వికెట్లు పడగొట్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ అంటేనే సిక్సర్ల మోత.. అలాంటిది సాకిబ్ హుస్సేన్ ఒక్క సిక్సర్ కూడా ఇవ్వకపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గ్రేట్ బౌలర్ అని కొనియాడుతున్నారు.
సాకిబ్ బౌలింగ్‌లో వేగంతో పాటు వేరియేషన్స్ అద్బుతంగా ఉన్నాయని, త్వరలో టీమిండియాకు కూడా ఆడుతాడని హనుమ విహారి వంటి వెటరన్ ఆటగాళ్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సీనియర్ పేసర్లు జయదేవ్ ఉనాద్కత్, హర్షల్ పటేల్ దారుణంగా విఫలమవడంతో అవకాశం అందుకున్న సాకిబ్ హుస్సేన్ అరంగేట్ర మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టాడు.

రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సాకిబ్ హుస్సే.. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో వరుస మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డేంజరస్ శివమ్ దూబేను క్లీన్ బౌల్డ్ చేసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. లేట్‌గా వచ్చిన సాకిబ్.. లెటెస్ట్ బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ పెద్ద అసెట్‌గా మారాడు.
అమ్మ నగలు అమ్మితే స్టార్ అయ్యాడు..
బీహార్‌లోని గోపాల్‌గంజ్ అనే ఓ చిన్న గ్రామం నుంచి ఐపీఎల్ వరకు సాకిబ్ హుస్సేన్ చేరుకున్న తీరు అసాధారణం. సాకిబ్ హుస్సేన్ తండ్రి ఒక సామాన్య కూలీ. రోజుకు కేవలం 200 నుంచి 300 రూపాయల సంపాదనతో ఐదుగురు సభ్యులున్న కుటుంబాన్ని పోషించడం వారికి గగనమైపోయేది. అటువంటి కటిక పేదరికంలో పెరిగిన సాకిబ్, దేశం కోసం ఏదైనా చేయాలనే కసితో మొదట ఆర్మీలో చేరాలని భావించాడు. కానీ అతని వేగవంతమైన బౌలింగ్ అతన్ని క్రికెట్ మైదానానికి పరిచయం చేసింది.
సాకిబ్ హుస్సేన్ వేగంగా బౌలింగ్ చేయడం గమనించిన అతని స్నేహితులు అతడిని ప్రోత్సహించారు. అయితే ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటానికి కావాల్సిన స్పైక్ షూస్ కొనడం సాకిబ్ తండ్రికి సాధ్యం కాలేదు. ఆ షూస్ ధర సుమారు 10-15 వేల రూపాయలు. కొడుకు బాధను చూడలేక.. సాకిబ్ తల్లి, తన వద్ద ఉన్న కొద్దిపాటి బంగారు నగలను అమ్మి ఆ డబ్బుతో షూస్ కొనిచ్చింది. ఆ షూస్ ధరించి మైదానంలోకి దిగినప్పుడే.. తన తల్లి త్యాగానికి వెల కట్టలేని విజయాన్ని అందించాలని సాకిబ్ హుస్సేన్ గట్టిగా నిశ్చయించుకున్నాడు.
దేశవాళీలో సత్తా చాటి..
కేవలం 17 ఏళ్ల వయసులోనే బీహార్ సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సాకిబ్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో అరంగేట్రం చేశాడు. తన రెండో మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని కొనుగోలు చేసినప్పటికీ, ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు.
ఆ నిరాశను పక్కన పెట్టి, 2025-26 రంజీ సీజన్‌లో అరుణాచల్ ప్రదేశ్‌పై 6 వికెట్లు తీసి తాను రెడ్ బాల్ క్రికెట్‌లో కూడా మొనగాడినని నిరూపించుకున్నాడు. 2026 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సాకిబ్ హుస్సేన్‌ను 30 లక్షల రూపాయలకు దక్కించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications