Sunrisers Hyderabad Probable Squad For IPL 2022: హైదరాబాద్‌లోకి పడిక్కల్, శార్దూల్.. పూర్తి జట్టు ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా జరిగే వేలంలో ఉన్న క్రికెటర్ల తుది జాబితాను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. 1258 మంది ఆటగాళ్లు మెగా వేలానికి రిజిస్టర్ చేసుకోగా అందులో నుంచి బీసీసీఐ 590 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. మెగా వేలానికి సమయం దగ్గరపడుతున్న వేళ ఫ్రాంచైజీలన్నీ తమ వ్యూహాలను వేగవంతం చేశాయి. ఏయే ఆటగాళ్లను తీసుకోవాలని, ఎంత ఖర్చు పెట్టాలనే పక్కా లెక్కలను తయారు చేసుకుంటున్నాయి.
మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం పకడ్బందీ ప్రణాళికలతో వేలం బరిలోకి దిగనుంది. గత సీజన్లలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూనే బలమైన కోర్ టీమ్‌ను ఎంచుకోవాలని భావిస్తోంది. రిటెన్షన్ ప్రక్రియలో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పాటు అన్ క్యాప్‌డ్ ప్లేయర్స్ ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్‌లను మాత్రమే తీసుకున్న ఆ జట్టు.. వేలంలో టీమిండియా యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌తో పాటు స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోవాలని భావిస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ టార్గెట్ చేసిన ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం.

ఓపెనర్లుగా పడిక్కల్, బెయిర్ స్టో..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ స్లాట్ కోసం సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో పాటు యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌పై కన్నేసింది. విదేశీ ప్లేయర్లలో మాజీ ప్లేయర్ బెయిర్ స్టోతో పాటు జాసన్ రాయ్‌లను తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. వృద్దిమాన్ సాహాను కూడా బ్యాకప్ ఆప్షన్ కిందపెట్టుకుంది. అయితే శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టోలకు భారీ ధర పలికే చాన్సుంది. ఈ ఇద్దరిలో ఒక్కరు సన్‌రైజర్స్‌కు చిక్కే అవకాశం ఉంది. అయితే సన్‌రైజర్స్ ఈ ఇద్దరి కోసం రూ.11 కోట్ల కంటే ఎక్కువ పెట్టే అవకాశం లేదు. దేవదత్ పడిక్కల్ కూడా సన్‌రైజర్స్‌కు ఓ మోస్తారు ధరకు దక్కవచ్చు.

మిడిలార్డర్‌లో రాయుడు, రైనా, స్మిత్
మిడిలార్డర్‌లో అంబటి రాయుడు, సురేశ్ రైనా, స్టీవ్ స్మిత్‌లతో పాటు డేవిడ్ మలాన్‌లను సన్‌రైజర్స్ టార్గెట్ చేసింది. ఓవర్ సీస్ కోటా కేన్ విలియమ్సన్ ఉన్న నేపథ్యంలో భారత ఆటగాళ్లను తీసుకునేందుకే సుముఖంగా ఉంది. కెరీర్ చివరి దశలో ఉన్న అంబటి రాయుడు, సురేశ్ రైనా ఓ మోస్తారు ధరకే సన్‌రైజర్స్ చేతికి చిక్కే అవకాశం ఉంది. అయితే తెలుగు క్రికెటర్ రాయుడి కోసం హైదరాబాద్ రూ.8 కోట్లు చెల్లించేందుకైనా సిద్దంగా ఉన్నట్లు టీమ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో రాయుడే సన్‌రైజర్స్‌కు చిక్కే అవకాశం ఉంది.

స్పిన్నర్లు కుల్దీప్, చాహల్, ఆదిల్ రషీద్..
రషీద్ ఖాన్ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ చేజారడంతో ఆ లోటును తీర్చుకునేందుకు సన్‌రైజర్స్ దేశీయ ఆటగాళ్లపై కన్నేసింది. స్పిన్ ఆప్షన్స్ కోసం కుల్దీప్ యాదవ్‌తో పాటు యుజ్వేంద్ర చాహల్, ఆదిల్ రషీద్‌లను టార్గెట్ చేసింది. అయితే యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకునేందుకు రెడీ అయింది.అతనికి రూ. 10 కోట్లు అయినా చెల్లించాలనుకుంటుంది. చాహల్ చిక్కితే.. దేశవాళీ స్పిన్నర్లను తీసుకొని మ్యాచ్‌కు రెడీ చేసుకోవాలనుకుంటోంది.

పేసర్లు ఆవేశ్ ఖాన్, రబడా, బౌల్ట్..
ఇక పేసర్లలో ఉమ్రాన్ మాలిక్ రూపంలో దేశీయ స్టార్ అందుబాటులో ఉండగా.. అనుభవం కలిగిన బౌలర్లను తీసుకోవాలనుకుంటుంది. ఆవేశ్ ఖాన్, కగిసో రబడా, ట్రెంట్ బౌల్ట్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్‌పై సన్‌రైజర్స్ కన్నేసింది. రబడా, కమిన్స్ రూ.15 కోట్లకు పైగా పలికే అవకాశం ఉండటంతో ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్‌లు సన్‌రైజర్స్‌కు చిక్కే అవకాశం ఉంది. మహమ్మద్ షమీని కూడా ఓ రూ.8 కోట్లకు సన్‌రైజర్స్ తీసుకునే చాన్స్ ఉంది.
ఆల్‌రౌండర్ల జాబితాలో అబ్దుల్ సమద్ జట్టులో ఉండటంతో బౌలింగ్ ఆల్‌రౌండర్లను సన్‌రైజర్స్ టార్గెట్ చేయనుంది. టీమిండియా స్టార్లు వాషింగ్టన్ సుంధర్‌తో పాటు శార్దూల్ ఠాకూర్‌ను టార్గెట్ చేసింది. ఓవర్‌సీస్ కోటాలో మహమ్మద్ నబీని మళ్లీ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు (అంచనా)
దేవదత్ పడిక్కల్, జానీ బెయిర్ స్టో, కేన్ విలియమ్సన్(కెప్టెన్), అంబటి రాయుడు, సురేశ్ రైనా, అబ్దుల్ సమద్, ఫాబియన్ అలెన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, షెబాజ్ అహ్మద్, ధావల్ కులకర్ణి, కమలేశ్ నాగర్ కోటీ, ఫిన్ అలెన్, సిద్దార్థ్, బాబా అపరజిత్, విష్ణు సోలంకి
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications