Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: వారితోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలవలేదు!

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు మరో విజయాన్నందుకుంది. ఈ సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. పంజాబ్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరుతుందని ఆ ఫ్యాన్స్ గట్టిగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉన్నా.. ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ విభాగం తేలిపోతుంది.

కెప్టెన్ ప్యాట్ కమిన్స్, టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ.. ఐపీఎల్ స్పెషలిస్ట్ పేసర్ హర్షల్ పటేల్ వంటి కత్తిలాంటి బౌలర్లు ఉన్నా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ మాత్రం తీసకట్టుగానే ఉంది. ఒకప్పుడు సన్‌రైజర్స్ బౌలింగ్ బలంతోనే మ్యాచ్‌లు గెలిచేది. కానీ ఈ సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ బౌలర్లపై ప్రత్యర్థి బ్యాటర్లు చెలరేగుతున్నారు.

Sunrisers Hyderabad need to improve bowling to get IPL 2025 title

మహమ్మద్ షమీ చెలరేగితేనే..?
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో స్టార్ పేసర్ అయిన మహమ్మద్ షమీ ధారళంగా పరుగులిచ్చాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 75 పరుగులు సమర్పించుకొని అత్యంత చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. బ్యాటింగ్‌ వికెట్‌పై బౌలింగ్ చేయడం కష్టమే. కానీ కాస్త తెలివిగా బౌలింగ్ చేసి బ్యాటర్లను కట్టడి చేయవచ్చు. భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి బౌలర్లు ఎన్నో ఏళ్లుగా తెలివిగా బంతులేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను కట్డడి చేస్తున్నారు. షమీ కూడా తన బౌలింగ్‌లో వేరియేషన్స్ చూపించాలి. స్లోయర్ బాల్స్, ఆఫ్ కట్టర్స్, బౌన్సర్లు, యార్కర్లు సరైన సమయంలో వేస్తే ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయవచ్చు.

కమిన్స్ సైతం..
అయితే షమీ వైఫల్యం.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. క్రికెట్‌లో ఓ బౌలర్ల మధ్య సమన్వయం ఉంటేనే వికెట్లు దక్కుతాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో బుమ్రా నిప్పులు చెలరేగితే.. షమీకి వికెట్లు దక్కేవి. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున షమీ తేలిపోతున్నాడు. దాంతో కమిన్స్ కూడా బలవుతున్నాడు. 6 మ్యాచ్‌ల్లో షమీ ఐదు వికెట్లు తీయగా.. కమిన్స్ 4 వికెట్లే పడగొట్టాడు. తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన ఆడమ్ జంపా తేలిపోయాడు. హర్షల్ పటేల్ ఒక్కడే పర్వాలేదనిపిస్తున్నాడు. ధారళంగా పరుగులిచ్చినా.. టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. యువ స్పిన్నర్ జీషాన్ అన్సారీ పర్వాలేదనిపిస్తున్నాడు. సిమర్జిత్ సింగ్, కుశాల్ మెండీస్ తమపై ఉంచిన నమ్మకాన్నినిలబెట్టుకోలేకపోయారు. ఇషాన్ మలింగా తన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.

7 మ్యాచ్‌లు గెలవాలి..
సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలవాలంటే సమష్టి ప్రదర్శన కనబర్చాలి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుగ్గా రాణిస్తేనే విజయాలు దక్కుతాయి. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంకా 8 లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో కనీసం 6-7 మ్యాచ్‌లు సన్‌రైజర్స్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. లేదంటే ఇంటిదారి పట్టాల్సి వస్తోంది.

Story first published: Monday, April 14, 2025, 17:05 [IST]
Other articles published on Apr 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+