కళావతి సాంగ్‌తో..
ఈ సాంగ్ రిలీజ్ గురించే ఎలాంటి ప్రకటన చేయని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అప్‌కమింగ్ మూవీ 'సర్కారువారి పాట'లోని కళావతి సాంగ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు చిందేసారు. ఈ వీడియోలో ఆటగాళ్లంతా జిమ్ చేస్తుండగా.. శ్రేయస్ గోపాల్ ఈ కొత్త పాట వినండని కళావతి సాంగ్ ప్లే చేశాడు. ఇక కేన్ విలియమ్సన్ ఏం సాంగ్ అని ప్రశ్నించగా.. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అని మరో ఆటగాడు బదులిస్తూ డ్యాన్స్ చేశాడు.
తర్వాత సాంగ్ వింటే..
ఇంతలోనే ఆంధ్ర క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్ బౌలర్ హరిశంకర్ రెడ్డి తెలుగులో మాట్లాడుతూ.. 'ఈ పాటకే ఇలా అయిపోతున్నారు... తర్వాతి సాంగ్ వింటే ఏమైపోతారో'అని కామెంట్ చేశాడు. ఇక ఈ వీడియో ఎండింగ్‌లో ఎస్ఎస్ థమన్ రూపొందించిన సన్‌రైజర్స్ అంథెమ్ సాంగ్ త్వరలోనే మీ ముందుకు రాబోతుందని ఉంది.

రాజస్థాన్‌తో ఢీ..
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇవాళ (మార్చి 29) తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌కు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదిక కానుంది.
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఎన్నడూ లేనంత బలంగా కనిపిస్తుండగా.. ఇందు భిన్నంగా ఎస్‌ఆర్‌హెచ్ చాలా బలహీనంగా, ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగనుంది. గత రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఎదురెదురుపడిన 15 సందర్భాల్లో ఆరెంజ్ ఆర్మీ ఎనిమిది సార్లు, గులాబీ దళం ఏడు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశాయి


Click it and Unblock the Notifications
