Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి నియత్ లేదు! పాపం డేవిడ్ భాయ్! ఫ్యాన్స్ భావోద్వేగం!

Sunrisers Hyderabad Is the Worst IPL Franchise Says David Warner Fans
IPL 2021 : Warner Hero To Zero అయ్యాడా ? SRH ఇజ్జత్ లేదు Worst IPL Franchise-Fans | Oneindia Telugu

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌మేనేజ్‌మెంట్‌పై ఆ జట్టు మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి కొంచెం కూడా నియత్ లేదని, ఎన్నో ఏళ్లుగా జట్టును తన భుజాలపై మోసిన వార్నర్‌కు కనీస గౌరవం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో డేవిడ్ వార్నర్ దారుణంగా విఫలమయ్యాడు. అతని వైఫల్యం టీమ్ పెర్ఫామెన్స్‌పై ప్రభావం చూపింది. కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగుస్థానంలో నిలిచింది. దాంతో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించి కేన్ విలియమ్సన్‌ను సారథిగా నియమించింది. ఆ తర్వాత కరోనాతో బ్రేక్ రాగా.. సెకండాఫ్‌లోను వార్నర్ మెప్పించలేకపోయాడు. రెండు మ్యాచ్‌ల్లోను దారుణంగా విఫలయ్యాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న తాజా మ్యాచ్‌లో వార్నర్‌ను పక్కనపెట్టేసింది. వార్నర్‌ను పక్కనపెట్టడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

టైటిల్ గెలిపించిన నియత్ కూడా..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను డేవిడ్ వార్నర్‌ ఒంటి చేత్తో చాంపియన్‌గా నిలబెట్టాడని, ఒక్కడే 848 రన్స్ చేశాడని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఫైనల్లో సూపర్ ఫామ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును తనదైన బ్యాటింగ్, కెప్టెన్సీతో దెబ్బకొట్టి తొలి టైటిల్ అందించాడని, కానీ ఫ్రాంచైజీ ఆ నియత్ లేదని మండిపడుతున్నారు. వరుసగా నాలుగేళ్లలో మూడు సార్లు జట్టు ప్లే ఆఫ్ చేర్చాడని, ఈ మూడు సార్లు బ్యాటింగ్ బాధ్యతలను తన భుజాన మోసాడని గుర్తు చేస్తున్నారు. ఇంత సాధించిన ఆటగాడి పట్ల ఇలా ప్రవర్తించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆరెంజ్ జెర్సీలో చూడలేమా?

తుది జట్టులో చోటు కోల్పోయిన డేవిడ్ వార్నర్‌ను మళ్లీ ఆరెంజ్ జెర్సీలో చూడలేమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుందని అతని అభిమానులు అంటున్నారు. ఇది సన్‌రైజర్స్‌కు తీరని నష్టం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. 4 వేలకుపైగా పరుగులు, 49.55 సగటు, 142.59 స్ట్రైక్‌రేట్, టైటిల్ అందించిన వీరుడు, 42 హాఫ్ సెంచరీలు చేసిన వార్నర్‌ను పక్కనపెట్టడం పిచ్చి నిర్ణయమంటున్నారు. ఫామ్ అనేది టెంపరరని, క్లాస్ పర్మ్‌నెంట్ అని పేర్కొంటున్నారు. రెండు మ్యాచ్‌లు ఆడితే వార్నర్ టచ్‌లోకి వస్తాడని చెబుతున్నారు.

ఆర్‌సీబీలోకి వార్నర్..

ఐపీఎల్ 2022 మెగా వేలం నేపథ్యంలో డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకుంటుందని, అదే జరిగితే వార్నర్ ఆర్‌సీబీలోకి వెళ్లడం ఖాయమంటున్నారు. ఇక ఆర్‌సీబీలోకి వార్నర్ వెళ్తే.. కెప్టెన్ కూడా అవుతాడని, కోహ్లీతో కలిసి ఆడుతాడని కామెంట్ చేస్తున్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ సైతం వార్నర్ కోసం ప్రయత్నిస్తుందని, అతను ఎంత విలువైన ఆటగాడో అప్పుడు సన్‌రైజర్స్‌కు తెలిసొస్తుందని కామెంట్ చేస్తున్నారు. పనికిరాని ఆటగాళ్లను తీసుకొని వార్నర్‌పై అనవసర ఒత్తిడి క్రియేట్ చేశారని, ముందుగా టీమ్‌మేనేజ్‌మెంట్‌ను మార్చాలని సూచిస్తున్నారు.

జాతి రత్నాలపై వేటు..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయన్నాడు. యువ పేసర్ కార్తీక్ త్యాగీ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని షంసీ, మిల్లర్ స్థానాల్లో క్రిస్ మోరీస్, లూయిస్ జట్టులోకి వచ్చారని చెప్పాడు. త్యాగీ ప్లేస్‌లో జయదేవ్ ఉనాద్కట్ వచ్చాడు. హైదరాబాద్ జట్టులో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్థానంలో జాసన్ రాయ్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. ఇక యువ ఆటగాళ్లు ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, సిద్దార్థ్ కౌల్‌కు అవకాశం ఇచ్చారు. సీనియర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే,కేదార్ జాదవ్‌తో పాటు ఖలీల్ అహ్మద్ వేటుకు గురయ్యారు.

Story first published: Monday, September 27, 2021, 20:55 [IST]
Other articles published on Sep 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+