ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కత్తి లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. జట్టులోని ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. అందుకనుగుణంగా జట్టును నిర్మించింది. జట్టుకు కావాల్సిన ఆటగాళ్లపై మాత్రమే ఫోకస్ పెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్.. చాలా తెలివిగా వ్యవహరించింది.
తొలి రోజు వేలంలో దూకుడు కనబర్చిన కావ్య పాప.. కావాల్సిన ఆటగాళ్ల కోసం తగ్గేదేలే అన్నట్లు బిడ్ వేసింది. ప్యాట్ కమిన్స్‌కు తోడుగా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని రూ. 10 కోట్లకు కొనుగోలు చేసిన కావ్య పాప.. పేస్ ఆల్‌రౌండర్ హర్షల్ పటేల్‌ను రూ. 8 కోట్లకు దక్కించుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే హైదరాబాద్ పిచ్‌పై హర్షల్ పటేల్ బౌలింగ్ పనికొస్తుందని అతన్ని కొనుగోలు చేసింది.

అంతేకాకుండా లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేయగలడని భావించింది. తమ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ మైదానానికి తగ్గట్లుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లను ఎంపిక చేసింది. వెటరన్ స్పిన్నర్లు రాహుల్ చాహర్, ఆడమ్ జంపాలను కొనుగోలు చేసింది. నెంబర్ 3 స్లాట్ కోసం ఇండియన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను రూ. 11.25 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది.
అనామక బ్యాటర్లు అభినవ్ మనోహర్‌తో పాటు అథర్వ టైడ్‌లను తీసుకుంది. పేపర్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు అనుభవం, కుర్రాళ్లతో సమతూకంగా ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
మహ్మద్ షమి (రూ. 10 కోట్లు), హర్షల్ పటేల్ (రూ. 8 కోట్లు), ఇషాన్ కిషన్ (రూ. 11.25 కోట్లు), అభినవ్ మనోహర్ (రూ. 3.20 కోట్లు), రాహుల్ చాహర్ (రూ. 3.20 కోట్లు), ఆడమ్ జంపా (రూ. 2.40 కోట్లు), సిమర్‌జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు), అథర్వ టైడ్ (రూ.30 లక్షలు), జీషాన్ అన్సారీ(రూ.40 లక్షలు), జయదేవ్ ఉనాద్కత్(రూ.1 కోటి), కమిందు మెండీస్(రూ.75 లక్షలు), అనికేత్ వర్మ(రూ.30 లక్షలు), బ్రిడన్ కార్స్(రూ. కోటి), అనికేత్ వర్మ(రూ. 30 లక్షలు), ఇషాన్ మలింగా(రూ. 1.20 కోట్లు), సచిన్ బేబీ (రూ. 30 లక్షలు)
సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ లిస్ట్:
హెన్రీచ్ క్లాసెన్(రూ. 23 కోట్లు), ప్యాట్ కమిన్స్(రూ. 18 కోట్లు), ట్రావిస్ హెడ్(రూ. 14 కోట్లు), అభిషేక్ శర్మ(రూ.14 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి(రూ.6 కోట్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, మహమ్మద్ షమీ
ఇంపాక్ట్ ప్లేయర్: సచిన్ బేబీ/అథర్వ టైడ్