IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే.. కోల్‌కతాతో ఫస్ట్ మ్యాచ్!!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 షెడ్యూల్ ఆదివారం విడుదల అయిన విషయం తెలిసిందే. 52 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 60 మ్యాచ్‌లు జరగనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఏప్రిల్ 9న చెన్నై వేదికగా జరుగనున్న పోరుతో 14వ సీజన్ ప్రారంభం కానున్నది. టోర్నీకి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై వేదికలుగా ఉన్నాయి.
లీగ్ దశలో ప్రతీజట్టు నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు ఆడనుంది. ఇక వైరస్ నేపథ్యంలో ఈసారి తొలి దశ మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. మలి దశకు ప్రేక్షకులను అనుమతించడంపై తర్వాత నిర్ణయం తీసుకుంటారు.

సొంతగడ్డపై ఆడే అవకాశం లేదు
14వ సీజన్‌లో ఏ జట్టూకూ సొంతగడ్డపై ఆడే అవకాశం లేదు. హైదరాబాద్, పంజాబ్, రాజస్థాన్ ఫ్రాంఛైజీల నగరాలను మ్యాచ్‌ల కోసం ఎంపిక చేయకపోవడంతో.. ఏ జట్టుకూ ఆతిథ్య సానుకూలత ఉండొద్దన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆటగాళ్లు వైరస్ బారిన పడకూడదన్న ఉద్దేశంతో లీగ్ దశలో ఒక్కో జట్టు మూడు సార్లు మాత్రమే ప్రయాణం చేసేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే టోర్నీ కోసం ఎంపిక చేసిన నగరాల్లో హైదరాబాద్‌కు చోటు దక్కకపోవడం ఇక్కడి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ ముంబైని ఎంపిక చేసిన బీసీసీఐ.. వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉన్న భాగ్యనగరాన్ని విస్మరించడం విస్మయాన్ని కలిగిస్తోంది.

హైదరాబాద్.. ప్చ్
స్థానిక ఫ్రాంఛైజీ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఉప్పల్ స్టేడియంతో మంచి అనుబంధం ఉంది. ఆ జట్టు ఆడే మ్యాచ్‌ల కోసం స్టేడియానికి పోటెత్తుతారు. జట్టుకు, అభిమానులకు మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో తమ జట్టు ఆటను ప్రత్యక్షంగా చూడలేకపోతున్నామనే బాధ అభిమానులను వేధించడం ఖాయం. ఈ ఏడాది ఐపీఎల్ వేదికలు ఖరారు చేశారని, అందులో హైదరాబాద్ లేదనే వార్తలు వినిపించగానే.. తమ నగరంలో కూడా మ్యాచ్‌లు నిర్వహించాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ బీసీసీఐని కోరారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.

తొలి మ్యాచ్‌లో కోల్‌కతాతో
చెన్నై వేదికగా వచ్చే నెల 11న సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనుంది. లీగ్ దశలో మొత్తం 14 మ్యాచులకు గాను 11 మ్యాచులు రాత్రి 7.30 గంటలకి హైదరాబాద్ ఆడనుంది. ఇక పంజాబ్, రాజస్థాన్, కోల్‌కతాలతో జరిగే మూడు మ్యాచులు మాత్రం మధ్యాహ్నం 3.30 గంటలకి మొదలవుతాయి. చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వేదికలుగా హైదరాబాద్ మ్యాచులు ఆడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఓసారి పరిశీలిస్తే.

సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్
1) ఏప్రిల్ 11న కోల్‌కతాతో (చెన్నైలో రాత్రి 7.30 గంటలకి)
2) ఏప్రిల్ 14న బెంగళూరుతో (చెన్నైలో రాత్రి 7.30 గంటలకి)
3) ఏప్రిల్ 17న ముంబైతో (చెన్నైలో రాత్రి 7.30 గంటలకి)
4) ఏప్రిల్ 21న పంజాబ్‌తో (చెన్నైలో మధ్యాహ్నం 3.30 గంటలకి)
5. ఏప్రిల్ 25న ఢిల్లీతో (ముంబైలో రాత్రి 7.30 గంటలకి)
6. ఏప్రిల్ 28న చెన్నైతో (ఢిల్లీలో రాత్రి 7.30 గంటలకి
7. మే 2న రాజస్థాన్‌తో (ఢిల్లీలో మధ్యాహ్నం 3.30 గంటలకి)
8. మే 4న ముంబైతో (ఢిల్లీలో రాత్రి 7.30 గంటలకి)
9. మే 7న చెన్నైతో (ఢిల్లీలో రాత్రి 7.30 గంటలకి)
10. మే 9న బెంగళూరుతో (కోల్‌కతాలో రాత్రి 7.30 గంటలకి)
11. మే 13న రాజస్థాన్‌తో (కోల్‌కతాలో రాత్రి 7.30 గంటలకి)
12. మే 17న ఢిల్లీతో (కోల్‌కతాలో రాత్రి 7.30 గంటలకి)
13. మే 19న పంజాబ్‌తో (బెంగళూరులో రాత్రి 7.30 గంటలకి)
14. మే 21న కోల్‌కతాతో (బెంగళూరులో మధ్యాహ్నం 3.30 గంటలకి)
షాహిద్ అఫ్రిదీ కుమార్తెను పెళ్లాడబోతున్న స్టార్ పేసర్!! ఇద్దరికీ 20 ఏళ్లే!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications