షాహిద్ అఫ్రిదీ కుమార్తెను పెళ్లాడబోతున్న స్టార్ పేసర్!! ఇద్దరికీ 20 ఏళ్లే!

కరాచి: పాకిస్థాన్ యువ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ పెద్ద కుమార్తె అక్సా అఫ్రిదీని త్వరలోనే అతను పెళ్లి చేసుకోబోతున్నాడు. అఫ్రిదీ తనయ అక్సాతో షహీన్ షాకు నిశ్చితార్థం త్వరలోనే జరగబోతోందని సమాచారం. నిశ్చితార్థానికి ఇప్పటికే తేదీని కూడా ఇరు కుటుంబాలు ఖారారు చేసినట్లు తెలుస్తోంది. అయితే గత కొంత కాలంగా ఈ వివాహానికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అఫ్రిదీ కుటుంబం అంగీకరించింది
షాహిద్ అఫ్రిదీ కుటుంబంతో గత కొన్నినెలలుగా చర్చలు జరిపినట్లు తాజాగా చెప్పుకొచ్చిన షాహీన్ షా అఫ్రిదీ తండ్రి అయాజ్.. ఎట్టకేలకి వారు పెళ్లికి ఒప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 'గత కొన్ని నెలలుగా రెండు కుటుంబాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. మా అభ్యర్థనను అఫ్రిదీ కుటుంబం అంగీకరించింది' అని అయాజ్ చెప్పారు. అఫ్రిదీకి మొత్తం ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. అక్సా, అన్షా, అజ్వా, అస్మరా, ఆర్వా. వీరిలో పెద్ద కుమార్తె అక్సా. అయితే షాహీన్, అక్సాలకు 20 ఏళ్లే కావడం విశేషం.

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు
షాహిద్ అఫ్రిదీ కూడా పెళ్లి విషయాన్ని ధ్రువీకరించాడు. 'నా పెద్ద కూతురు కోసం షాహీన్ అఫ్రిదీ ఫ్యామిలీ నా కుటుంబాన్ని సంప్రదించింది. రెండు కుటుంబాలు టచ్‌లో ఉన్నాయి. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు. అల్లా దయదలిస్తే.. ఈ పెళ్లి జరుగుతుంది. షాహీన్ అఫ్రిదీ కెరీర్ బాగుండాలని కోరుకుంటున్నా' అని అఫ్రిదీ ట్వీట్ చేశాడు. పాకిస్తానీ జర్నలిస్ట్ ఇతిషామ్ ఉల్ హక్ స్పందిస్తూ.. 'షాహిన్, అక్సా నిశ్చితార్థం నిజమే. రూమర్లు కాదు. ఇరు కుటుంబాలు ఇప్పటికే అంగీకరించాయి. త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుంది. అయితే పెళ్లి మాత్రం అక్సా చదువు పూర్తయిన తర్వాత జరగనుంది' అంటూ క్లారిటీ ఇచ్చాడు.

2018లో అరంగేట్రం
షాహీన్ అఫ్రిదీ 2018లో పాకిస్థాన్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకూ 15 టెస్టులు, 22 వన్డేలు, 21టీ20 మ్యాచ్‌లాడాడు. అతని కాలంలోనే స్టార్ పేసర్‌గా ఎదిగాడు. ఇప్పటికే 117 వికెట్లని పడగొట్టిన ఈ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్.. మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అఫ్రిదీతో కలిసి షహీన్ ఆడాడు. షాహీన్ లాహోర్ క్యూలాండర్స్‌కు.. షాహిద్ ముల్తాన్ సుల్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. షాహీన్ లీగ్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు.

టెస్ట్, టీ20 సిరీస్ కైవసం:
ఇటీవల దక్షిణాఫ్రికాతో పాకిస్తాన్ టెస్ట్, టీ20 సిరీస్ ఆడింది. రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ను 2-0తో, మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను 2-1తో పాక్ గెలుచుకుంది. ఇక ఇరు జట్ల మధ్య ఏప్రిల్ రెండు నుంచి వన్డే సిరీస్, ఏప్రిల్ 10 నుంచి టీ20 సిరీస్ జరగనుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా పడడంతో ప్రస్తుతం పాక్ ఆటగాళ్లు ఖాళీగానే ఉన్నారు. మరోవైపు ఇంగ్లండ్‌తో భారత్ మ్యాచులు ఆడుతున్న విషయం తెలిసిందే.
స్విస్ ఓపెన్ 2021 ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. విజేత మారిన్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications